త్రివిక్రమ్ ఈ సినిమా తో మళ్ళీ తానేంటో చెప్పాల్సిందే!!
ప్రస్తుతం మహేష్ బాబుతో ఆయన తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించడానికి అన్ని సిద్ధం చేస్తున్నాడు. మహేష్ బాబుతో గతంలో రెండు సినిమాలు చేసిన త్రివిక్రమ్ ఆయన చిత్రాలతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అతడు సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా త్రివిక్రమ్ దర్శకుడిగా మంచి పేరు సంపాదించి పెట్టింది అని చెప్పవచ్చు. ఆ తర్వాత చేసిన ఖలేజా సినిమా కూడా కమర్షియల్ గా బాగా ఆడింది. అలా ఈ ఇద్దరి కలయికలో వచ్చిన రెండు సినిమా లు సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్ లో ఓ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడగా ఇప్పుడు హ్యాట్రిక్ సినిమా గా రాబోతున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో అన్న అంచనాలు ఇప్పుడు ఏర్పడ్డాయి.
ఈ రెండు చిత్రాల మధ్యలో త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ చిత్రానికి రచయితగా చేశాడు. సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కాబోతు ఉండగా తాను దర్శకత్వం వహిస్తున్న సినిమాకి కాకుండా రచయిత గా చేస్తున్న సినిమా కి ఇంత సమయం వెచ్చిస్తు ఉండడం ఆశ్చర్యకరం అనే చెప్పాలి. ఏదేమైనా త్రివిక్రమ్ ఇప్పుడు చేయబోయే మహేష్ బాబు సినిమాతో తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇతర దర్శకులు సినిమాలతో దూసుకుపోతుంటే త్రివిక్రమ్ మాత్రం రచయితగానే సినిమాలు చేయడం పట్ల ఆయన అభిమానులు నిరాశగా ఉన్నారు. మళ్ళీ మహేష్ తో సినిమా చేస్తే పాన్ ఇండియా దర్శకుడిగా తనను తాను ఎలా ఆవిష్కరించు కుంటాడో చూడాలి.