ఒక్క సినిమా 13 అవార్డులు.. అభినయ ఎంత కష్టపడిందంటే..?
అభినయ ఏడవతరగతిలో ఉండగానే.. ఓ తమిళ సినిమాలో బాల నటిగా నటించే అవకాశం లభించింది. ఆ తరువాత ఆవిడకు ఎలాంటి సినిమాల్లో నటించడానికి అవకాశం రాలేదు. ఆమె వినలేకపోవడం, మాట్లాడలేకపోవడం మూలంగా అభినయకు అవకాశాలు రాలేదని చెప్పొచ్చు. ఆమెకు ఉన్న నటన పట్ల ఆసక్తిని గ్రహించిన తండ్రి యాడ్స్లోఐనా నటింపజేయాలని ప్రయత్నించాడు. యాడ్స్ లో అయితే మాట్లాడాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆవిడను నటించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ విధంగా పలు యాడ్స్లలో నటించింది.
అయితే ఆమె తండ్రికి కూడా నటన పట్ల ఇష్టం ఉండడంతో సినిమాల్లో నటించేందుకు ఆర్టిస్ట్‌గా ట్రై చేసేవారు. ఆయన వెళ్లిన ప్రతిచోట తనతో పాటు కూతురు ఫొటోలను కూడా ఇచ్చేవారు. ఫొటోలో అభినయ నవ్వు చూసిన వారు అమ్మాయి భలే ఉందనే వారు. మాటలు రావు అని తెలియడంతో ముఖం చిట్టించేవారు. ఇదిలా ఉండగానే.. నాదోదిగల్ అనే సినిమా కోసం ఓ ముంబై సెలక్ట్ చేసుకున్నారు. ఆవిడకు తమిళం మాట్లాడటం కష్టం కావడంతో నేను నటించను అని వెళ్లిపోయింది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు కొప్పడి ఎలాగైనా అసలు కమ్యూనికేషన్ తెలియని హీరోయిన్ను నటింపజేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికప్పుడు అభినయను తీసుకొచ్చి వెండితెరకు పరిచయం చేశాడు.
ఆ సినిమా భారీ విజయం అందుకుంది. ఒకే సినిమాకు ఏకంగా 13 అవార్డులు లభించాయి. ఇదే సినిమాను తెలుగులో శంభోశివశంబోగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రవితేజ చెల్లెలుగా నటించింది అభినయనే. ఆ తరువాత కన్నడంలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అభినయ చెవిటి, మూగ కావడంతో కావడంతో ఎలా నటించింది అనే అనుమానం రావచ్చు. అయితే ఆవిడ చెప్పాల్సిన డైలాగులు ముందుగానే దర్శకుడు తల్లిదండ్రులకు చెప్పేవాడు. దీంతో తన కూతురుకు సైగల ద్వారా చూపించారు. సింగిల్ టేక్‌లోనే అభినయ తన డైలాగ్‌లకు తగిన ఎక్స్ప్రెషన్ ఇస్తూ నటించేది. ఆమె నటించిన మొదటి సినిమాకే తెలుగు, తమిళంలో కలిపి రెండు ఫిలిం ఫెయిర్ అవార్డులను అందుకున్నది. తెలుగులో శంభోశివశంబో, దమ్ము, ఢమరుకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు అత్యంత చేరువైంది అభినయ.