ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే మొదటి సినిమాతోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే విజయాన్ని అందుకొని వరసబెట్టి క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకుంటారు. అయితే అలాంటి హీరోయిన్ లలో కృతి శెట్టి గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. ఈ ముద్దుగుమ్మ పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దుగుమ్మ నటనకు, అందచందాలకు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ప్రశంసలు దక్కడంతో కృతి శెట్టి కి టాలీవుడ్ లో వరుస పెట్టి క్రేజీ సినిమా ఆఫర్లు వచ్చాయి.
అందులో భాగంగా ఈ ముద్దుగుమ్మ నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా ఈ మద్యేనే థియేటర్ లలో విడుదల అయ్యింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను సొంతం చేసుకొని ప్రస్తుతం కూడా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. ఇలా ఇప్పటికే టాలీవుడ్ లో రెండు విజయాలను అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం నటించిన బంగార్రాజు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. అయితే కృతి శెట్టి బంగార్రాజు సినిమా కోసం రెండు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. మరి నిజంగానే కృతి శెట్టి 'బంగార్రాజు' సినిమా కోసం రెండు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుందా, లేదా అనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇది ఇలా ఉంటే ఈ ముద్దుగుమ్మ బంగార్రాజు సినిమా తో పాటు నితిన్ హీరోగా తెరకెక్కుతున్న మాచర్ల నియోజకవర్గం ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు సుధీర్ బాబు సరసన ఒక సినిమాలో, రామ్ పోతినేని సరసన కూడా ఒక సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.