సినిమా
ఇండస్ట్రీ లో
హీరోయిన్ లపై లైంగిక వేధింపులు జరుగుతున్న సంగతి తెలిసిందే.. చాలా హీరోయిన్లు ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఈ విషయం పై అన్నీ
ఇండస్ట్రీ లలో చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.హీరోయిన్ భావనపై జరిగిన లైంగిక వేధింపుల కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నమలయాళ స్టార్
హీరో దిలీప్ కుమార్‌పై
కేరళ పోలీసులు ఇటీవల నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు..
2017
ఫిబ్రవరి 17న షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో హీరోయిన్ భావనను కిడ్నాప్ చేసి లైంగిక వేధింపులకు గురి చేయడం అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు నెలల జైలు శిక్ష తర్వాత దిలీప్ కుమార్ బెయిల్‌పై విడుదలయ్యాడు. ఇప్పుడు మళ్ళీ ఇతని కేసుకు సంబంధించిన అధికారులని భయపెట్టడంతో అతని సోదరుడు అనూప్, బంధువు సూరజ్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది.
ఇది ఇలా ఉండగా.. ఈ విషయం పై
హీరోయిన్ భావన స్పందించింది.తనకు జరిగిన చేదు సంఘటనను గుర్తు చేసుకొని సోషల్ మీడియాలో ఓ పోస్టును షేర్ చేసింది.
భావన తన సోషల్ మీడియాలో.. 'బాధితురాలి నుంచి ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. గత ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి, నా పేరు, నా గుర్తింపు పోయింది. నేరం చేసింది నేను కానప్పటికీ, నన్ను అవమానించడానికి, మౌనంగా ఉంచడానికి, ఒంటరిగా ఉంచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినట్లు తెలుస్తుంది.
అలాంటి సమయంలో కూడా నా గొంతును సజీవంగా ఉంచడానికి ముందుకొచ్చిన వారు ఉన్నారు. ఇప్పుడు నేను చాలా మంది గొంతులు వింటున్నాను. న్యాయం కోసం పోరాడుతున్న ఈ ప్రయత్నంలో నేను ఒంటరిని కాదని నాకు తెలుసు. న్యాయం గెలవాలని, తప్పు చేసిన వారికి శిక్షపడేలా చూడాలని, మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు నేను నా ప్రయాణం కొనసాగిస్తాను. ఇందులో నాకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయం ఎంత వరకూ వెళుతూందో చూడాలి..