నాగచైతన్యలో సింగర్ కూడా ఉన్నాడా.. ఎలా పాడాడో చూడండి?
నాలుగేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడేచిన్నినాయన అనే సినిమాకు ఈ సినిమా సీక్వల్ అన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బంగార్రాజు మనవడిగా నాగచైతన్య కనిపించబోతున్నాడు అన్నది ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొత్తంగా ఈ సంక్రాంతికి హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు ఈ అక్కినేని హీరోలు. అయితే నాగచైతన్య ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి బాగా నటించగలడు అన్న విషయం అందరికీ తెలుసు. కానీ నాగచైతన్య పాటలు కూడా పాడగలడు అన్నది చాలామందికి తెలియదు. కానీ ఇటీవలే నాగచైతన్య ఏకంగా తన తండ్రి సినిమాలలోని పాటలను పాడి అందరినీ అలరించారు.
ఇన్నాళ్ల పాటు తనలో దాగివున్న సింగర్ ను బయటపెట్టాడు నాగచైతన్య. ఇటీవల కేరళ లో సంక్రాంతి అల్లుళ్లు సందడి అనే ఈ ఈవెంట్ ను స్టార్ మా లో ప్లాన్ చేశారు. ఇక బంగార్రాజు చిత్ర బృందం స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. ఆ తర్వాత సుమ టీం ఒకవైపు కమెడియన్ అలీ టీం ఒక వైపు గా విడిపోయి అంత్యాక్షరి ఆడారు. ఈ సమయంలోనే సుమా టీంలో నాగచైతన్య కూడా భాగం అయ్యాడు. ఈ అంత్యాక్షరీ లో భాగంగా తండ్రి నాగార్జున కు సంబంధించిన ఫోటోలు స్క్రీన్ మీద వస్తూ ఉంటే ఇక ఆ సినిమాలోని పాటలు పాడుతూ నాగచైతన్య సందడి చేశారు. ఇక ఇది చూసి చైతన్య లో పాడే టాలెంట్ కూడా ఉందా అని అభిమానులు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.