వామ్మో:svsc మూవీకి ఎన్ని కోట్లు లాభమో తెలుసా..?

Divya
విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు , సమంత, అంజలి కలయికలో వచ్చిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించడం జరిగింది. ఇక ఇందుకు నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించారు. టాలీవుడ్ లో ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక మల్టీ స్టారర్ మూవీ గా చిత్రీకరించబడింది. ఇక దీంతో అప్పటి నుంచి మల్టీస్టారర్ మూవీలు బాగానే విడుదలవుతున్నాయి. ఇక అప్పట్లో పెళ్లి సందడి మూవీ ని ఎలా ఎంజాయ్ చేశారో అదే విధంగా ఈ సినిమాను కూడా ఎంజాయ్ చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

ఈ సినిమా 2013లో జనవరి నెలలో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్లు రాబట్టింది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. కలెక్షన్ల విషయానికి వస్తే..
1). నైజాం-15.20 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-6.50 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-3.80 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-3.78 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-3.6 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-3.58 కోట్ల రూపాయలు.
7). కృష్ణ-2.85 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-2.4 కోట్ల రూపాయలు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే..40.81 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
10). రెస్టాఫ్ ఇండియా-5.52 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-7.24 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..53.59 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది.
ఈ సినిమాకి 45.8 కోట్ల రూపాయల వరకూ థియేట్రికల్ బిజినెస్ జరగగా.. ఈ సినిమా ముగిసేసరికి ఏకంగా 53.59 కోట్ల రూపాయలను రాబట్టింది. దీంతో బయ్యర్లకు ఏకంగా ఈ సినిమా కి 7.79 కోట్లు లాభం చేకూర్చిందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కంటే ముందు మహేష్ బాబు దూకుడు, బిజినెస్ మేన్ వంటి సినిమాలలో ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పవచ్చు. దీంతో వరుస హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. వెంకటేష్ కెరియర్ లోనే ఎక్కువ కలెక్షన్లు చేసిన సినిమాగా ఇది నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: