ఇప్పుడు ఆచార్య చూపు ఎటువైపు!!
అయితే మరొక సారి ఈ సినిమాకు బ్యాడ్ లక్ ఎదురయింది అని చెప్పవచ్చు. కరోనా మరొకసారి దేశంలో విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు ఎక్కువవుతున్నాయి. తొందర్లోనే దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి తెరపై కనిపించి చాలా రోజులవుతుంది.ఈ నేపథ్యంలో మెగా అభిమానులు ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవడం పట్ల తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా లో ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తుండగా మణిశర్మ సంగీతం నుంచి వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. చిత్రంపై భారీ అంచనాలు కూడా ఈ పాటలు పెంచాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు సంవత్సరం నుంచి ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అవుతూ రాగా ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి వారి ఆశలను తీరుస్తూ ఉందో చూడాలి.