ఇది ఒక సుకుమార్ కే చెల్లింది!!
ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్లో వచ్చే ఈ మూడవ సినిమా సూపర్ హిట్ అవడం మాత్రమే కాదు అల్లు అర్జున్ కు ఇండియా వైడ్ గా భారీ స్థాయిలో ఇమేజ్ తీసుకురావాల్సిన బాధ్యత సుకుమార్ పై ఏర్పడింది. అందుకే ఆ అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి ఎన్నో అవమానాలను ఎదుర్కొని చిత్రాన్ని తెరకెక్కించి ఇప్పుడు ఇంతటి స్థాయి విజయాన్ని అల్లు అర్జున్ కు అందించాడు సుకుమార్. ఏదైతేనేం అల్లు అర్జున్ ఏ స్థాయిలో పాన్ ఇండియా ఇమేజ్ కావాలి అనుకున్నాడో అదే స్థాయిలో ఈ సినిమా హిట్ అయ్యింది.
అయితే సుకుమార్ తన మొదటి సినిమా నుంచి ఐటమ్ సాంగ్స్ పెట్టి ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. దాదాపుగా అన్ని సినిమాల్లోనూ ఆయన ఐటెం సాంగ్ పెట్టి మంచి బిజినెస్ చేశాడు. అదే విధంగా ఆయన గత రెండు చిత్రాల్లో స్టార్ హీరోయిన్ లను ఐటం భామలుగా మార్చి వారితో చేయడం జరిగింది. ఇది కేవలం సుకుమార్ కె చెల్లింది అని చెప్పాలి. వాస్తవానికి పెద్ద హీరోయిన్లు ఎవరు కూడా ఇలాంటి పాత్రలో నటించడానికి పెద్దగా ఒప్పుకోరు. కానీ ఏ విధంగా వారిని మాయ చేశాడో తెలియదు కానీ వారిని ఈ పాటలో చేయడానికి ఒప్పించాడు సుక్కు. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే మరియు సమంత సుకుమార్ సినిమా లలో ఐటెం సాంగ్స్ చేసిన తర్వాత వారి కెరీర్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది అని చెప్పవచ్చు.