నందమూరి నటసింహం
బాలకృష్ణ పోయిన సంవత్సరం
టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమాతో బాక్సాఫీసు దగ్గర
బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాలో
బాలకృష్ణ సరసన
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ
సినిమా ఇప్పటికీ కూడా విజయవంతంగా
థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది. అయితే ఇలా అఖండ
సినిమా విజయం తర్వాత
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన
పూజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాలో
బాలకృష్ణ సరసన
శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది.
అలాగే ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో దునియా
విజయ్ కనిపించనుండగా, మరో కీలకమైన పాత్రలో
వరలక్ష్మి శరత్ కుమార్ కనిపించబోతుంది. ఈ సినిమాలో
బాలకృష్ణ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఒక పాత్రలో
బాలకృష్ణ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనుండగా, మరో పాత్రలో పవర్ ఫుల్
పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను గోపీచంద్ మలినేని యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చి దిద్దబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు జై
బాలయ్య అనే టైటిల్ ను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు గత కొన్ని రోజులుగా అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. ఈ మధ్యే
బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమాలో కూడా జై
బాలయ్య అనే సాంగ్ ఫుల్ ఫేమస్ అయ్యింది. అయితే
బాలకృష్ణ,
గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు జై
బాలయ్య అనే టైటిల్ నే చిత్ర బృందం ఫైనల్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఈ
సినిమా టైటిల్ పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
బాలకృష్ణ ఈ
సినిమా తర్వాత
అనిల్ రావిపూడి దర్శకత్వం లో నటించబోతున్నాడు.