త్వరలోనే అక్కినేని వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయ అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. నిజానికి అక్కినేని హీరోలకు పెళ్లిళ్లు అచ్చి రావడం లేదు. నాగార్జున.. వెంకటేష్ చెల్లెలు లక్ష్మి ని పెళ్లి చేసుకుని కొన్నాళ్లకు విడాకులు ఇచ్చి ఆ తరువాత అమలను పెళ్లి చేసుకున్నాడు.ఇక నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకుని ఇటీవలే విడిపోవడం జరిగింది. ఇక అఖిల్ కూడా నిశ్చితార్ధం చేసుకుని ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాడు. అఖిల్- శ్రీయా భూపాల్ నిశ్చితార్థం గ్రాండ్గా జరిగిన విషయం తెలిసిందే.శ్రీయ ప్రముఖ పారిశ్రామికవేత్త జి వి కే కంపెనీల అధినేత మనవరాలు.
ఇక అఖిల్- శ్రీయా భూపాల్ ల వివాహం ఇటలీలో జరిపించాలని ఇరు కుటుంబాలు డిసైడ్ అయ్యాయి. కానీ అంతలోనే అఖిల్, శ్రీయ ల మధ్య మనస్పర్థలు వచ్చాయని టాక్ వినిపించింది. దీంతో వారిద్దరు వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టకుండానే వారి పెళ్లి కి శుభం కార్డు పడింది. అయితే ఈ బాధ నుండి బయట పడడానికి ఇంట్లో మళ్లీ శుభకార్యం చేయబోతున్నారట. అక్కినేని ఇంటికి త్వరలోనే కొత్త కోడలు రాబోతోందట. ఇంటికి పెద్ద కొడలి గా వచ్చిన సమంత విడాకులు తీసుకొని మధ్యలోనే వెళ్ళిపోయింది. దీంతో నాగార్జున చిన్న కోడలిని తీసుకురావాలని భావిస్తున్నారట. అంటే అఖిల్ పెళ్లి త్వరలో చేయాలని అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే అఖిల్ పెళ్లి కోసం నాగార్జున మంచి సాంప్రదాయ పద్ధతిలో కలిగిన కుటుంబం నుంచి ఓ అమ్మాయిని చూశారట. ఈ సంబంధం దాదాపు ఫిక్స్ అయినట్టే అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ కి సంబంధం లేని అమ్మాయిని అఖిల్ కోసం ఏరికోరి సెలెక్ట్ చేసారట నాగార్జున. ప్రస్తుతం ఇదే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరి ఇది ఎంత వరకు నిజం అనేది తెలియాలంటే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేంతవరకు ఆగాల్సిందే. ఇక మరోవైపు నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన 'బంగార్రాజు' సినిమా తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. అటు అఖిల్ కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు...!!