బంగార్రాజు : సినిమా చూసి ఇంటికి రాగానే అమల ఏమి చేసిందంటే..?
అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటేడ్ జీ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా కూడా వ్యవహరించారు. విడుదలైన తొలిరోజే సంక్రాంతి బ్లాక్ బాస్టర్ హిట్‌గా నమోదు చేసుకున్నది. ఈ సందర్భంగా సినిమా హీరో అక్కినేని నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సందర్భంగా బంగార్రాజు సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసిన ప్రేక్షకులకు పాదాబివందనం చేస్తున్నట్టు తెలిపారు. ఈ చిత్రం మైసూర్ ప్రాంతంలో తీసాం. అక్కడ ఎంతో మంది సహకరించారని.. ప్రతీ నటినటులకు, టెక్నిషియన్లకు మరొకసారి ధన్యవాదాలు చెప్పారు నాగార్జున.
ఇందులో ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌ను రామ్ లక్ష్మణ్ బాగా ఓన్ చేసుకొని డిజైన్ చేసారు. వాటికి మంచి పేరొస్తుందన్నారు. ఈ సినిమా చూసిన తరువాత పెద్ద బంగార్రాజు పాత్ర ఎక్కువ ఉందని.. చాలా మంది చెప్పారు. అది పాత్ర పరంగా దర్శకుడు చేసినదే. సినిమా చూసిన వారందరూ.. వారి భావోద్వేగాలు తెలియజేస్తుంటే.. తీసిన సినిమాకు సార్థకత ఏర్పడింది అనిపించింది. ముఖ్యంగా బంగార్రాజు చిత్రం చూసిన తరువాత అమల ఇంటికి చేరుకోగానే ఆమె అత్త, మామల ఫొటోలకు దండం పెట్టుకొని.. ఏడ్చింది అని నాగార్జున వెల్లడించారు.
వారు మా వెనుక ఉన్నారు అనే ఫీలింగ్‌ను వ్యక్తం చేసింది. ఇదే అభిప్రాయమును చాలా మంది వారి అమ్మమ్మలు, నాయనమ్మలు, తాతయ్యలు, నాన్నలను గుర్తు చేసుకున్నాం అని చెప్పారు. ముగింపు చూపించినట్టుగా మరొక సినిమా కూడా తీయొచ్చు. దర్శకుడు ఓ క్లూ కూడా ఇచ్చాడు. ప్రతీ 24 ఏళ్లకు శివాలయంలో హోమం చేయాలని, కానీ ఇప్పుడిప్పుడే సినిమా చేయలేము. ఆలోచించి అన్ని అనుకూలించినట్టయితే అప్పుడు చూద్దామని నాగార్జున వివరించారు.