షాక్ : అవును వాళ్లిద్దరూ విడిపోయారు?
దేవుడిని నమ్ముకుని జీవించే
సూపర్ స్టార్ ఇంటి కథలో మరో మలుపు
వీధి వీధికీ ఓ మలుపు ప్రతి కథకూ ఓ కన్నీటి ముగింపు
వీధి కథ ఎలా ముగియనుందో..
విధి రాత ఏ విధంగా మార్చనుందో?
ఇవన్నీ చిత్రమే అతి చిత్రమే! కోలివుడ్ లో పండగ నాట
మరో కన్నీటి కథ..
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఊహించని పరిణామం ఇది..ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య భర్త ధనుష్ తో విడిపోతున్నారు. ఇందుకు సంబంధించిన విడాకుల ప్రకటనను ధనుష్ ట్విటర్ ద్వారా వెల్లడించారు.18 ఏళ్ల తమ వైవాహిక బంధాన్ని తెంపుకుంటున్నామని చెప్పారీయన. వీరిద్దరికీ 2004 వ సంవత్సరంలో వివాహం అయింది.ఈ జంటకు ఇద్దరు పిల్లలు.కొలీవుడ్ లో టాప్ హీరోల్లో ఒకడిగా రాణిస్తున్న స్టార్ హీరో ధనుష్ తమిళంలో ప్రముఖ దర్శకుడు ఇంకా నిర్మాత అయినా కస్తూరి రాజా కుమారుడు.ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సెల్వ రాఘవన్ ధనుష్‌కు స్వయానా అన్నయ్య.వాస్తవానికి వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి.కొన్ని సంవత్సరాల క్రితం సంచలనంగా మారిన సుచి లీక్స్ వ్యవహారంలో అప్పుడు ధనుష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఫొటోలు విడుదలయ్యాయి. అప్పటినుంచే వీరిద్దరి మధ్య దూరం అనేది పెరిగిందని తెలుస్తోంది.
ఇక ధనుష్ విడాకులు తీసుకుంటున్నట్లు లేఖలో ఈ విధంగా పేర్కొన్నాడు."18 సంవత్సరాల నుంచి మేమిద్దరం మంచి స్నేహితులుగా,జంటగా,తల్లిదండ్రులుగా,శ్రేయోభిలాషులుగా కలిసున్నాం.ఒకరినొకరు చాలా బాగా అర్థం చేసుకుంటూ, సర్దుకుపోతూ ఉన్నాం.పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఇప్పటిదాకా ప్రయాణించాం. మా ఇద్దరి దారులు నేడు వేరవబోతున్నాయి.మేం భార్యాభర్తలుగా మాత్రమే విడిపోయి..వ్యక్తులుగా మాత్రం ఒకరి గురించి ఒకరు మరింత తెలుసుకోవాలనుకుంటున్నాం.మా నిర్ణయాన్ని గౌరవించి మాకు ప్రైవసీని ఇవ్వండి" అని రాస్తూ, లేఖను ట్విట్ చేశాడు.చివర్లో శివుడిదే అంతా భారం అన్న అర్థం తోచేలా ఓం నమఃశివాయ అని రాసి తమ విడాకుల ప్రకటనకు తాత్విక ముగింపు ఇచ్చాడు.