పండగకు పండగలాంటి సినిమా రానే వచ్చింది
గోదావరి తీరాల్లో పండగ సంతోషాలు రెట్టింపు చేస్తూ
సర్పంచ్ నాగ లక్ష్మి (కృతిశెట్టి) సందడి చేసింది
బంగార్రాజులు (నాగ చైతన్య, నాగార్జున)
ఇద్దరూ తమ తమ ఆనందాలను పంచుకుని
బ్లాక్ బస్టర్ మీట్ కు ఓ నిండుదనం తెచ్చారు ఇవాళ
ఆ విశేషాలివిగో ...గో... గో ...
బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్ ను రాజమహేంద్రి వరంలో మార్గాని ఎస్టేట్స్ లో వైభవోపేతంగా ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడికి చిత్ర యూనిట్ చేరుకుని అభిమానులను అలరించింది.తమ ఆనందాలను పంచుకుని ఉర్రూతలూగించింది. వేడుకలకు ఏపీ మినిస్టర్ కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగా విచ్చేయగా,మరో అతిథిగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున ఏమన్నారో ఆయన మాటల్లోనే...
ఈ సినిమా గెలుపు ఈ సినిమా విజయం అంతా మీ నమ్మకం అని యూనిట్ పొగుడుతున్నారు.అది నా నమ్మకం కాదు నాకు మీపై ఉన్న నమ్మకం. సంక్రాంతి అంటే సినిమా, సినిమా అంటే సంక్రాంతి అని మరోసారి రుజువు చేశారు. రాజమహేంద్రవరంలో సినిమా హౌస్ ఫుల్స్ తో నడుస్తుందని విన్నాను..నేను కలెక్షన్స్ గురించి మాట్లాడడానికి రాలేదు.నేను మీ ప్రేమ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను.మీ ప్రేమ ముందు కలెక్షన్లు ఎంత నథింగ్...ఈ సందర్భంగా నాన్నకు మరో మారు ధన్యవాదాలు చెప్పుకోవాలని ఉంది.ఇదంతా ఆయన మాకు ఇచ్చారు.
ముఖ్యంగా నా సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉండాలి.మొన్న నా మిత్రులు చిరంజీవితో మాట్లాడాను.ఏం మాట్లాడారు సీఎంతో అని అడిగాను.ఫిల్మ్ ఇండస్ట్రీకి అంతా మంచే జరుగుతుందని జగన్ హామీ ఇచ్చారని చిరు నాతో అన్నారు.ఈ సందర్భంగా వైఎస్ జగన్ గారికి ధన్యవాదాలు చెబుతున్నాను. బంగార్రాజు అచ్చమయిన తెలుగు సినిమా..బంగార్రాజులం మేం కాదు నాన్న గారు బంగార్రాజు..ఆయన ఉన్నారు వారికి ఇంకోసారి నమస్కారం చెప్పుకుంటున్నాను.ఇండస్ట్రికి రెండు కళ్లు ఒకరు నందమూరి తారక రామారావు గారు ఇంకొంకరు అక్కినేని నాగేశ్వరరావు గారు..ఇవాళ నందమూరి తారక రామారావు వర్ధంతి.. ఇవాళ..అందుకే అంటున్నాను ఎన్టీఆర్ లివ్స్ ఆన్ .. ఏఎన్నార్ లివ్స్ ఆన్ అని అంటున్నాను..
- నాగార్జున