అనుష్క శెట్టి.. ఈమె గురించి ప్రత్యెకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు స్టార్ హీరోయిన్లలో ఒకరు. మన్మథుడు కింగ్ నాగర్జున నటించిన సూపర్
సినిమా ద్వారా
హీరోయిన్ గా నటించింది. మొదటి
సినిమా తోనే మంచి పేరు తెచ్చుకుంది. తన అందంతో యువతను తన వైపు లాక్కుంది. అలా వరుస సినిమాల లొ నటిస్తూ వస్తుంది. అరుంధతీ సినిమాలో లేడి ఓరియెంటెడ్ పాత్రలో కనిపించింది. ఈ
సినిమా భారీ విజయాన్ని అందుకోవడం తో మంచి పేరు తెచ్చుకుంది..
ఆ
సినిమా తో జెజెమ్మ గా మారింది.అప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి పాత్రల లో నటిస్తూ పాపులర్ అవుతుంది. ఎన్నో
బ్లాక్ బస్టర్ సినిమాల ను
ఇండస్ట్రీ కి ఇచ్చింది. ఆ తర్వాత దర్షక బ్రహ్మ రాజమౌలి తెరకెక్కించిన
బాహుబలి 1,
బాహుబలి 2 సినిమాలలో నటించి ప్రపంచ స్థాయి రికార్డ్ ను అందుకుంది. ఆ
సినిమా తో సినీ కెరియర్ మరో మైలు రాయికి చేరుకుంది. ఆ తర్వాత
భాగమతి సినిమాలో నటించింది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి హిట్ టాక్ ను అందుకుంది.
అందుకు కారణాలు కూడా ఉన్నాయని సినీ విష్లెషకులు అంటున్నారు. అందులో ముఖ్య కారణం
అనుష్క గతం లో లాగా గ్లామర్ షో లు చేయడం లేదు. అందుకె
సినిమా అవకాశాలు కూడా తగ్గినట్లు తెలుస్తుంది. సైజ్
జీరో సినిమా కోసం బాగా బరువు పెరిగింది. కానీ ఆ బరువును తగ్గించుకోవడంలో ఆమె ఫెయిల్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే
అనుష్క వరుస సినిమాలు చేసేందుకు ఒప్పుకోవడం లేదు అని ప్రచారం జరుగుతుంది.ఈ ఒక్క కారణం చేత ఆమె దగ్గరకు ఆమెకు
సినిమా దర్షక, నిర్మాతలు కూడా కథలు చెప్పడానికి ముందుకు రాలేదని తెలుస్తుంది. మొత్తానికి అలా సినిమాలకు దూరంగా వుంది