అయితే ఇలా
సంక్రాంతి సీజన్ కు ఏ స్టార్
హీరో సినిమా లేకపోవడం, అలాగే బంగార్రాజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, మరియు ఈ సినిమాలో
నాగార్జున తో పాటు
నాగ చైతన్య కూడా నటించడం ఇలా అనేక అంశాలు ఈ సినిమాకు కలిసి రావడంతో బంగార్రాజు
సినిమా ఫుల్ గా కలెక్షన్ లను సాధిస్తుంది. ఇది ఇలా ఉంటే అధిక వసూళ్ళు తెచ్చిపెట్టిన ఏపీలో ఇప్పుడు 50 శాతం ఆక్యుపెన్సీతో పాటుగా నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే, ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో బంగార్రాజు సినిమాకు కలెక్షన్ లు ఏరేంజ్ లో ఉంటాయి అనేది ఆసక్తికరంగా మారింది. బంగార్రాజు మూవీని సోషియో ఫాంటసీ ఔట్ అండ్ ఔట్ రూరల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దారు దర్శకుడు కళ్యాణ్ కృష్ణ. బంగార్రాజు సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై
నాగార్జున నిర్మించారు.