స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కి ప్రేరణ ఎవరో తెలుసా?

VAMSI
ఇండస్ట్రీ లోకి వచ్చిన తక్కువ సమయంలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్న నటులలో వెన్నెల కిషోర్ ఒకరు అని సందేహం లేకుండా చెప్పొచ్చు. చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఈ హాస్య నటుడు ఉండాల్సిందే. వెన్నెల కిషోర్ ఉంటే ఇక ఆ సినిమాలో నవ్వడం కోసం ఎదురుచూడక్కర్లేదు, పక్కా కామెడీ ఫుల్ గా ఉంటుంది అన్న నమ్మకం ప్రేక్షకులకు కలిగించి తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు కిషోర్.  ఇతని అసలు పేరు బొక్కల కిషోర్ కుమార్. వెన్నెల సినిమాతో వచ్చిన క్రేజ్ తో ఇతడి పేరులో వెన్నెల వచ్చి చేరి వెన్నెల కిషోర్ గా మారింది. ఆ సినిమా లో కిషోర్ పర్ఫార్మెన్స్ చూసాక అంతా వెన్నెల కిషోర్ అంటూ పిలవడం మొదలెట్టారు.

సెప్టెంబర్ 19,1980 లో తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో జన్మించారు. ఇపుడు వెన్నెల కిషోర్ వయసు 41. ఇక విద్యార్హత విషయానికొస్తే బీకాం అండ్ మాస్టర్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ను పూర్తి చేశారు. వెన్నెల మూవీ కిషోర్ కి వచ్చిన మొదటి ఆఫర్. ఆ సినిమా కోసం జాబ్ ను పక్కన పెట్టి మరి ఆడిషన్స్ కి వచ్చి ఆ సినిమాలో ఒక పాత్రకు సెలెక్ట్ అయ్యాడు. అప్పట్లో ఆ సినిమాకి గాను 70 వేలు రెమ్యునరేషన్ ను పుచ్చుకున్నారు. ఆ తరువాత అతని టాలెంట్ తో వరుస అవకాశాలు అందుకుని బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 4 లక్షల వరకు పారితోషకాన్ని అందుకుంటున్నారు ఈ హాస్య కళాకారుడు.

ప్రస్తుతం వెన్నెల కిషోర్ హైదరాబాద్ లో హైటెక్ సిటీలో వైష్ణవి నిర్వాణలో ఉంటున్నారు. ఏ ఇల్లు ఖరీదు 80 లక్షల వరకు ఉంటుంది. వెన్నెల కిషోర్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని. అలాగే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అంటే చాలా ఇష్టం. అతనిని చూస్తూ పెరిగి కమెడియన్ గా మారానని గతంలో ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: