నాని హీరోగా తెరకెక్కిన 'నిన్ను కోరి' సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు
శివ నిర్వాణ..ఆ తరువాత 'మజిలీ' మూవీతో
బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.ఇక ఈ క్రమంలో
విజయ్ దేవరకొండతో ఓ
సినిమా కూడా కమిట్ అయ్యారు.అయితే
విజయ్ దేవరకొండ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ గ్యాప్ లో నానితో 'టక్ జగదీష్'
సినిమా తెరకెక్కించారు. డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో
విజయ్ దేవరకొండ సినిమా హోల్డ్ లో పడిందని వార్తలు వచ్చాయి.విజయ్
దేవరకొండ ప్రస్తుతం 'లైగర్' సినిమాతో పాన్ ఇండియాను టార్గెట్ చేస్తూ ముందుకు రాబోతున్నాడు. ఇలాంటి టైంలో
శివ నిర్వాణతో
లవ్ అండ్ ఫ్యామిలీ
సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తరువాత వెంటనే
సుకుమార్ తో
సినిమా చేయాలని అనుకుంటున్నాడని రూమర్స్ కూడా వచ్చాయి. అంతేకాదు
విజయ్ దేవరకొండ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవడంతో ఇప్పుడు సీనియర్ స్టార్
హీరో వెంకటేష్ తో
సినిమా చేయడానికి
శివ రెడీ అయ్యారని వార్తలు వస్తున్నాయి.
ఇదే విషయాన్ని ఓ నెటిజన్ సోషల్
మీడియా ద్వారా దర్శకుడు
శివ నిర్వణ దృష్టికి తీసుకెళ్లాడు.ఈ విషయానికి స్పందించిన శివ.. అది తప్పుడు న్యూస్ అని క్లారిటీ ఇచ్చాడు.
విజయ్ దేవరకొండ తో క్యాన్సిల్ అయ్యి
వెంకటేష్ తో
సినిమా చేయబోతున్నాడనేది పూర్తిగా తప్పుడు వార్త అన కొట్టి పడేసాడు ఈ
మజిలీ దర్శకుడు. దీంతో
విజయ్ -
శివ కాంబోలో
సినిమా ఉంటుందని..
వెంకటేష్ తో
సినిమా లేదనే దానిపై క్లారిటీ వచ్చేసింది. కాకపోతే ఆ
సినిమా ఎప్పుడు ఉంటుందనేదే ప్రశ్నార్థకంగా మారింది.ఈ మధ్య
శివ నిర్వాణ నాలుగో
సినిమా కోసం తనకు కలిసొచ్చిన ప్రేమకథనే రెడీ చేస్తున్నట్లు వెల్లడించాడు. ప్రేక్షకుల మనసులకు బాగా దగ్గరైన 'నిన్ను కోరి' 'మజిలీ' సినిమాల తరహాలో మరో
లవ్ స్టొరీ రాస్తున్నానని.. ఇది చాలా ఎగ్జైటింగ్ గా ఇంకా హ్యాపీగా ఉందని . సముద్రపు కెరటాలు ఎంత ఒరిజినల్ గా ఉంటాయో అలాగే ఈ కథ కూడా అంత ఒరిజినల్ గా ఉంటుందని ఈ దర్శకుడు పేర్కొన్నాడు.