పౌరాణిక చిత్రాల్లో తెలుగువారిదే పై చేయి తెలుసా..?
ఆ తరువాత చాలా చిత్రాలే వచ్చిన ఎన్టీఆర్ అర్జునుడిగా, బృహన్నలగా విభిన్న పాత్రల్లో అత్యద్భుతంగా నటించిన నర్తనశాలను ప్రత్యేకించి చెప్పుకోవాలి. ఈ సినిమాకు దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. పౌరాణిక బ్రహ్మగా చెప్పదగ్గ మరో గొప్ప దర్శకుడు ఆయన. ఈచిత్రంలో కీచకుడి పాత్రలో ఎస్వీఆర్ అసాధారణ నటనకు విదేశాల్లో సైతం గుర్తింపు వచ్చింది. ఆ తరువాత ఎన్టీఆర్ సుయోధనుడిగా, కృష్ణుడిగా నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన శ్రీకృష్ణపాండవీయం మరో గొప్ప సినిమా. ఆ తరువాత కూడా ఎన్టీఆర్ నటిస్తూ దర్శకత్వం వహించిన దానవీరశూరకర్ణ వంటి చిత్రాలు తెలుగువారికి పౌరాణిక చిత్రాల రూపకల్పనలో మరెవరూ సాటిరాలేరన్న కీర్తిని సంపాదించిపెట్టినవే. ఇక బాలీవుడ్‌లలో 1965లో బాబూభాయ్ మిస్త్రీ రూపొందించిన మహాభారత్ ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో అభిభట్టాచార్య కృష్ణుడి పాత్రలోనూ ప్రదీప్‌కుమార్ అర్జునుడిగా, దారాసింగ్ భీముడిగా, పద్మిని ద్రౌపదిగా, తివారీ ధుర్యోధనుడిగా నటించారు. ఆ తరువాత జైసంతోషీ మా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది.