షాక్:మా ఇద్దరికీ అవంటే తెగ ఇష్టమంటున్న లవ్ బర్డ్స్..?
ఇక వర్కౌట్ చేసే వాటిలో ఎక్కువగా.. స్విమ్మింగ్, డాన్సింగ్ అంటే తెగ ఇష్టం అని చెప్పేసింది.. అంతేకాకుండా మార్షల్ ఆర్ట్స్ నేర్చుకునేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాం అని శృతిహాసన్ తెలిపింది. యోగా అంటే బోర్ కొడుతుందని.. దానికి చాలా సమయం కేటాయించాలని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. ఇక తనకి లిల్లీ పూలు, రోజా పూలు అయితే బాగా ఇష్టపడతానని వెల్లడించింది.. తనకు ఇష్టమైన పండ్లలో.. ముఖ్యంగా సీతాఫలం, చెర్రీ పండ్లు కూడా ఎంతో ఇష్టపడి తింటానని శృతిహాసన్ తెలిపింది. ఇక ఫుడ్ విషయానికి వస్తే దోసే, సాంబార్, వడ, రసం తనకి ఇష్టమైన ఆహారం ఆని తెలిపింది.
మొదటిసారిగా తన బాయ్ ఫ్రెండ్ శంతనుని 2018 లో కలిశానని ఆ తర్వాత 2020 వ సంవత్సరం నుంచి మేమిద్దరం రిలేషన్ లో ఉన్నాము అని తెలియజేసింది.. ఇక అంతే కాకుండా గిటార్ ప్లే చేయడం రాకపోయినా ఆ సౌండ్ అంటే తెగ ఇష్టం అని తెలిపింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ కు కూడా బిర్యాని, ఫ్రూట్ సలాడ్ , రవ్వ దోసె అంటే చాలా ఇష్టమని తెలియజేసింది. ఇక హెయిర్ స్టైల్ విషయానికొస్తే తనకి స్ట్రెయిట్ హెయిర్ స్టైల్ అంటే చాలా ఇష్టమట. మ్యూజిక్ డైరెక్టర్ A.R. రెహమాన్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. తన శరీరంలో బ్రెయిన్ హార్ట్ చాలా ఇష్టం అని శృతిహాసన్ తెలిపింది.