క్రిష్ ఎందుకలా వెనుకపడిపోతున్నాడు..!!
ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భవించగా ఇప్పుడు అది సాధ్యపడదు అని విషయం బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏ విధంగా కోలుకుంటోందో తెలియదు. కానీ ఈ ప్రభావం క్రిష్ పై భారీగా ఉంది అని మాత్రం తెలుస్తుంది. గమ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన ఈ దర్శకుడు ఎక్కువగా సామాజిక స్పృహ ఉన్న సినిమాలను చేసి మంచి దర్శకుడిగా పేరును సంపాదించుకోకలిగాడు. వేదం కంచె వంటి సామాజిక స్పృహ ఉన్న సినిమాలను చేసి మంచి అభిరుచిగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఆ తరువాత గౌతమీపుత్ర శాతకర్ణి అనే చారిత్రాత్మక సినిమా చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ ఎక్స్పీరియన్స్ తో హరి హరి వీర మల్లు అనే సినిమాను చేయడంలో మాత్రం పూర్తిగా వెనుకబడి పోయాడు. పవన్ వేరే సినిమా షూటింగ్ వెళ్లిపోవడంతో కొన్ని రోజులు ఈ చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేసి తాను కూడా కొండపొలం అనే సినిమాను చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఆయన కెరీర్ పై పడుతుందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఏ విధంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి క్రిష్ కు విజయాన్ని తీసుకు వస్తుందో చూడాలి.