డైలమా లో శివ నిర్వాణ.. వెంకీ నా.. విజయా!!
అయితే రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శివ తన మూడో సినిమాతో మాత్రం హిట్ కొట్టలేకపోయాడు. నాని హీరోగా చేసిన టక్ జగదీశ్ సినిమా పరాజయం పాలైంది. సినిమా ఓ టీ టీ లో విడుదలై శివ నిర్వాణ కి తీరని లోటు ను తెచ్చి పెట్టింది. అయితే ఈ టక్ జగదీష్ సినిమా విడుదల కాకముందే శివ నిర్వాణ తో విజయ్ దేవరకొండ తో సినిమా చేయనున్నాడని అనౌన్స్మెంట్ వచ్చింది. అయితే ఎప్పుడైతే ఆ సినిమా కాస్త ఫ్లాప్ అయిందో విజయ్ తో సినిమా ఉంటుందో లేదో అన్న అనుమానాలు పెరిగిపోయాయి అందరిలో.
ఇంకొక వైపు విజయ్ ఈ సినిమాని రిజెక్ట్ చేశాడని వెంకటేష్ కోసం ఆయన ఒక మంచి కథను తయారు చేసి తొందర్లోనే వినిపిస్తున్నారని వార్తలు షికార్లు చేశాయి. ఈ రెండిట్లో ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదుగానీ శివ నిర్వాణ చేయబోయే తదుపరి సినిమా గురించి ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి విజయ్ దేవరకొండ తో ఆయన తన తదుపరి సినిమా చేస్తాడా లేదా వెంకటేష్ తో చేస్తాడా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఏదేమైనా ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే వ్యల్యూ అనేది మరోసారి నిరూపితం అయ్యింది.