బాత్ టబ్ లో ఫోటో షూట్.. బాబోయ్ ఆండ్రియా ఏంటీ బీభత్సం..!

shami
కోలీవుడ్ హాట్ బ్యూటీ ఆండ్రియా మరోసారి తన హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. అక్కడ ఇక్కడ కాదు ఏకంగా బాత్ టబ్ లో హాట్ ఫోటో షూట్ చేసి తన ఇన్ స్టాగ్రాం లో పెట్టేసింది అమ్మడు. తమిళంలో బోల్డ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆండ్రియా ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క తన ఫాలోవర్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకు ఇలాంటి జిగేలు మనిపించే ఫోటో షూట్స్ చేస్తుంది. కెరియర్ మొదట్లో హీరోయిన్ గా చేసిన అమ్మడు ఇప్పుడు సైడ్ రోల్స్ తో అడ్జెస్ట్ అవుతుంది. అయినా సరే అమ్మడు తన గ్లామర్ షో విషయంలో తగ్గేదేలే అన్నట్టు ఉంది.
కోలీవుడ్ లో రెగ్యులర్ గా వార్తల్లో ఉండే ఆండ్రియా తన లైఫ్ లో ఓ పెద్ద తప్పు చేశానని.. కొన్ని బలహీన క్షణాలు తనని అలాంటి తప్పు వైపు నడిపించాయని ఒకరితో తను చేసిన సీరియస్ రిలేషన్ షిప్ గురించి చెప్పి బాధపడ్డది ఆండ్రియా. ఇక ఓ ప్రముఖ మ్యూజిక్ డైరక్టర్ తో అమ్మడు లిప్ లాక్ చేసిన ఫోటో లు అయితే ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. కోలీవుడ్ గాసిప్స్ లో మొదట చెప్పుకునే రెండు మూడు పేర్లలో ఆండ్రియా ఉంటుంది.
సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది ఆండ్రియా. లిప్ లాక్ సీన్స్, ఇంటిమేట్ సీన్స్, బెడ్ సీన్స్ ఎలాంటి వాటికైనా రెడీ అని చెప్పే ఆండ్రియా ఇప్పటికీ తానొక హీరోయిన్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది. తెలుగులో కేవలం తడాఖా సినిమా మాత్రమే చేసిన ఆండ్రియా ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసి పూర్తి ఫోకస్ కోలీవుడ్ మీదే పెట్టింది. 2021 లో 3 సినిమాలు 2022లో ఏకంగా ఐదు సినిమాల్లో అమ్మడు నటిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: