రకుల్ ఇక హీరోయిన్ గా చేయదా!!
మొదటినుంచి గ్లామర్ తో పాటు మంచి నటన కనబరిచిన ఈమె కొండపొలం సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది అని చెప్పాలి. అప్పటి వరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేస్తూ వచ్చిన ఈ ముద్దుగుమ్మ తొలిసారి నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేయగా అప్పటికి సమయం దాటిపోవడంతో కొత్త హీరోయిన్లు తమ గ్లామర్ తో అలరిస్తూ ఉండడంతో రకుల్ ను పట్టించుకోవడం మానేశారు మన దర్శక నిర్మాతలు ఆ విధంగా కనుమరుగైపోయింది ఈ ముద్దుగుమ్మ.
ఇతర భాషలలో సైతం ఆమెకు అవకాశాలు సన్నగిల్లడంతో ఇప్పుడు ఆమె బిజినెస్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. క్యాస్టింగ్ ఏజెన్సీని నెలకొల్పే విధంగా ఈమె ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏజెన్సీ ద్వారా కొత్త నటీనటులకు సినిమా అవకాశాలు ఇప్పించే విధంగా ఆమె ప్రయత్నాలు చేస్తుందట. ఏదేమైనా సినిమా మీద ఉన్న ఇంటరెస్ట్ తో సినిమా మీద ఉన్న ప్రేమతో సినిమా అవకాశాలు రాకపోయినా సినిమా ఇండస్ట్రీ లోనే ఉండాలని రకుల్ తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని చెప్పాలి మరి ఈ బిజినెస్ లో ఆమె భారీ సక్సెస్ అవ్వాలని కోరుకుందాము.