చంటి.. టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్ మూవీ అని అందరికి తెలుసు.విక్టరీ వెంకటేష్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా అది.. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ మీద ప్రముఖ నిర్మాత కేఎస్ రామారావు నిర్మించిన చిత్రమని అందరికి తెలుసు..
రామారావు బ్యానర్ లో వచ్చిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమానే ఇది. 1892 జనవరి 10న విడుదలై ఘన విజయాన్ని అందుకున్న సినిమా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు 30 ఏండ్లు పూర్తయ్యాయని ఈ సందర్భంగా నిర్మాత రామారావు ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారట..
ఈ సినిమా తమిళంలో తెరకెక్కిన చిన్న తంబి అనే సినిమా నుంచి రీమేక్ చేశారని తొలుత ఈ సినిమాను తెలుగులో తీయాలని భావించి దర్శకుడిగా రవి రాజాను పిక్స్ చేసినట్లు చెప్పాడట. ఈ సినిమాలో హీరోగా రాజేంద్ర ప్రసాద్ తో పాటు మరికొంత మందిని అనుకున్నట్లు కూడా ఆయన వెల్లడించాడు. అదే సమయంలో సురేష్ బాబు కలుగజేసుకుని వెంకటేష్ తో తీస్తే బాగుంటుంది అని చెప్పాడని ఆయన డేట్స్ ఇస్తే చెయ్యడానికి నాకు ఓకే అని రామారావు చెప్పారట.. విషయం వెంకీకి తెలిసి ఓకే చెప్పాడని తెలుస్తుంది.ఈ సినిమాలో తన పాత్రకోసం చాలా కష్టపడ్డాడట వెంకీ.అప్పటి వరకు ఉన్న ఇమేజ్ ఈ సినిమాతో ఓ రేంజిలో పెరిగిందని మీనా కూడా ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుందని సమాచారం.ఈ సినిమా తర్వాత తను కూడా స్టార్ హీరోయిన్ గా మారారు..
ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉందట. ఈ సినిమా కోనసీమలో జరుగుతున్నట్లు చూపించినా.. అక్కడ ఈ సినిమా కోసం చేసిన షూటింగ్ చాలా తక్కువ అన్నాడట. తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే ఎక్కువగా చిత్రీకరించినట్లు వెల్లడించాడు. హైదరాబాద్ లోనూ ఓ పాటను రూపొందించినట్లు కూడా ఆయన చెప్పాడు. కానీ జనాలు మాత్రం సినిమా అంతా కోనసీమలోనే జరిగినట్లు భావిస్తారని ఆయన అన్నారు . ఈ విషయంలో దర్శకుడి ప్రతిభ అద్భుతం అన్నారట.. రవిరాజా దర్శకత్వ గొప్పతనం మరియు వెంకటేష్ హార్డ్ వర్క్, మీనా అందం.. ఇళయరాజా మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు అసెట్స్ అని ఆయన చెప్పారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాను వెంకటేష్ ఒప్పుకోక ముందు రాజేంద్రప్రసాద్ ను అనుకున్నారట. కానీ సీన్ లోకి వెంకీ రాగానే ఆయన తప్పుకున్నారు.