ఆ ముగ్గురి వలన బాధ పడుతున్నామంటూ వర్ష కామెంట్స్ వైరల్..!!

N.ANJI
బుల్లితెరపై ఈటీవి ప్రసారమయ్యే జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న బ్యూటీ వర్ష. ఆమె బుల్లితెరపై సీరియళ్లతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పడు హాట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ భారీస్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంది. ఇక జబర్దస్త్ షోలో వర్ష ఇమ్మాన్యుయేల్ కలిసి చేసే స్కిట్లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.
తాజగా ఈ హాట్ బ్యూటీ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవ్వడంతో వైరల్ గా మారింది. ఇంతకీ ఆమె ఎమోషనల్ అవ్వడానికి కారణం ఏంటంటే.. తన సోదరుడు రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో ఆ బాధను వర్ష సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఇక ఆమె సోదరుడు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్న ఫోటోను షేర్ చేసిన వర్ష ప్రస్తుతం తన సోదరుడి ఆరోగ్యం బాగానే ఉందని తెలియపరు. అంతేకాదు.. డ్రైవింగ్ చేసే సమయంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చారు. ఇక జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే ఏ కుటుంబం కూడా బాధ పడదని వర్ష  పేర్కొన్నారు.
అయితే తన సోదరుడికి యాక్సిడెంట్ కావడానికి ముగ్గురు వ్యక్తులు నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే కారణమని వర్ష చెప్పుకొచ్చింది. ఇక ఆ ముగ్గురు వ్యక్తుల నిర్లక్ష్యం వల్ల తన సోదరుడికి ప్రమాదకరమైన పరిస్థితి ఎదురవడంతో పాటు కుటుంబం అంతా ఎంతగానో బాధ పడ్డామని ఆమె చెప్పుకొచ్చారు. వర్ష చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుత సమాజంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఈ ప్రమాదాలలో ఎక్కువ ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని అధికారులు చెబుతూనే ఉన్నారు. అయితే మరికొంతమంది వేగంగా వెళ్లాలనే ఆలోచనతో నిబంధనలను అతిక్రమించి వాహనాలను నడపటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక ఏది ఏమైనప్పటికి వర్ష పోస్ట్ వల్ల కొంతమందైనా మారతారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: