మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ తెలుగు ఇండస్ట్రీలో జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు. మొదటి సినిమాతోనే భారీ విజయం సాధించి మంచి పేరు సంపాదించుకున్న హీరో వైష్ణవ్ తేజ్. తన మొదటి సినిమా అయినా ఉప్పెనతో ఉప్పెనలా మారిపోయాడు. ఆ సినిమాతో అనుకోని విజయాన్ని సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇలా సరికొత్త రికార్డు సాధించిన తర్వాత వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు వైష్ణవ్ తేజ్. ఉప్పెన తర్వాత వచ్చిన సినిమా కొండపోలం అంతగా విజయం సాధించలేక పోయినా సరే కానీ తన నటనతో ఫ్యాన్స్ అందరిని ఆకట్టుకున్నారు అని చెప్పవచ్చు.
అంతే స్పీడుగా తన మూడవ సినిమాని కూడా బయట పెట్టబోతున్నారు వైష్ణవ్ తేజ్. శ్రీవెంకటేశ్వర సినీచిత్ర బ్యానర్పై, వి బి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మాణంలో కొత్త డైరెక్టర్ గిరీశాయ్య దర్శకత్వంలో వైష్ణవి తేజ్ మరో సినిమాని ఇటీవల బయట పెట్టారు. రంగ రంగ వైభవంగా అనే సినిమా టైటిల్ ని అంత వైభవంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో కథానాయికగా రొమాంటిక్ సీన్లతో కీతిక శర్మ నటించనుంది. ఈ సినిమా ఎంతో రొమాంటిక్ గా ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా వైష్ణవ్ తేజ్ కి మరో కొత్త రికార్డు సృష్టించబోతోంది అని వారంటున్నారు.
ఈ సినిమా అంతా మంచి రొమాంటిక్ బెస్ పై నిర్మాణం కాబోతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా తన ఎంట్రీ తోనే భారీ ఘన విజయం అందుకున్న వైష్ణవ్ తేజ్, టాప్ హీరోల వంద కోట్ల క్లబ్ లో చేరిపోవడం వైష్ణవ్ తేజ్ జీవితంలో మరొక మైలురాయి అని చెప్పవచ్చు. అయితే ఉప్పెన సినిమాతో నూతనంగా పరిచయమైన వైష్ణవి తేజ్, కృతి శెట్టి దీని విజయం అనంతరం అనేక సినిమాలతో ముందుకు వెళ్తున్నారు అని చెప్పవచ్చు. మరి రాబోయే రంగ రంగ వైభవంగా సినిమా ఉప్పెన సినిమా కంటే భారీ విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.