టాలీవుడ్ సీనియర్
హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఈ ముద్దుగుమ్మ నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం, లాంటి
బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకుంది. ఈ సినిమాలతో పాటు
త్రిష దాదాపు
టాలీవుడ్ లో ఉన్న అందరూ స్టార్ హీరోలతో నటించి
టాలీవుడ్ లో చాలా కాలం పాటు టాప్
హీరోయిన్ గా కొనసాగింది, త్రిష కేవలం తెలుగు భాష సినిమాల్లో మాత్రమే కాకుండా ఇతర భాషా సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా మంచి పాపులారిటీని సంపాదించుకుంది, అయితే ఇలా
టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న సమయంలోనే ఈ ముద్దుగుమ్మ
కోలీవుడ్ పైన ఇంట్రెస్ట్ పెట్టింది. అయితే
టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ నటించి కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, అయితే
త్రిష ప్రస్తుతం
సినిమా కాకుండా వెబ్ సిరీస్ ద్వారా
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించబోతోంది, అయితే ప్రస్తుతం
త్రిష బృంద అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది. ఇదిలా ఉంటే
మెగాస్టార్ చిరంజీవి హీరోగా
వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక
సినిమా తెరకెక్కబోతున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు, ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా ఇప్పటికే జరిగిపోయింది.
అయితే ఈ సినిమాలో చిత్ర బృందం
మెగాస్టార్ చిరంజీవి సరసన
త్రిష ను
హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల పై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు, ఒకవేళ నిజంగానే
చిరంజీవి సరసన
త్రిష కు అవకాశం వచ్చినట్లయితే మరొకసారి టాలీవుడ్లో తన సత్తా పోతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ముద్దుగుమ్మ తో పాటు మరో సీనియర్
హీరోయిన్ తమన్నా కూడా ప్రస్తుతం
టాలీవుడ్ లో వరుస సినిమాలతో సత్తా చాటుతోంది.