చైతూ లాల్ సింగ్ చద్దా రిలీస్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?
నాగ చైతన్య.. తన భార్య సమంత తో విడాకులు తీసుకున్న తర్వాత సినిమాలలో జోరు పెంచారు అని చెప్పాలి. ఆయనకు ఏదో అదృష్టం వరించినట్టు గా విడాకుల ముందువరకు ఏ ఒక్కటి కూడా ఆయన ఖాతా లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు లేవని చెప్పవచ్చు.. కానీ విడాకుల తర్వాత ఈయన నటించిన లవ్ స్టోరీ సినిమా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని.. మొట్టమొదటి సూపర్ హిట్ విజయాన్ని ఆయన ఖాతాలో వేసింది ఈ సినిమా.. ఆ తర్వాత తన తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాలో నటించడం.. ఈ సినిమా కూడా సూపర్ హిట్ విజయం అందుకోవడం గమనార్హం.. వరుస విజయాలను తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నాగ చైతన్య..
ఇక టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇమేజ్ ను సంపాదించుకోవడం కోసం బాలీవుడ్ వైపు ఆసక్తి చూపిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలోనే నాగచైతన్య ఫుల్ లెంగ్త్ రోల్ కాకుండా కీలక పాత్ర పోషించడానికి బాలీవుడ్లోకి అడుగుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ఇక అమీర్ ఖాన్ , రాధిక చౌదరి ప్రధాన పాత్రలో మిలిటరీ నేపథ్యంలో తెరకెక్కబోతున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ సినీ ప్రేక్షకులు, టాలీవుడ్ సినీ ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ఇక అందుకే చిత్రం మేకర్స్ కూడా ప్రేక్షకులను నిరాశ పరచకుండా ఈ సినిమాను త్వరలో రిలీజ్ చేస్తున్నామని డేట్ ని కూడా లాక్ చేయడం జరిగింది.