400 కోట్ల డీల్.. తగ్గేదేలే అంటున్న స్టార్ హీరోయిన్?
దీంతో ఒక వైపు సినిమాలు చేస్తూనే మరో వైపు ఓటీటీ వేదికగా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తున్నారు. మరి కొంత మంది సొంత నిర్మాణంలో వెబ్ సిరీస్ తెరకెక్కించి ఇక వాటితో సూపర్ సక్సెస్ అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి కోవలోకే వస్తుంది అనుష్క శర్మ. స్టార్ హీరోయిన్ లో వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇక విరాట్ కోహ్లీ తో పెళ్లి తర్వాత అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తుంది అని చెప్పాలి. కానీ వరుసగా వెబ్ సిరీస్ ల తో మాత్రం ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇకపోతే ఇటీవలే బాలీవుడ్ హాట్ హీరోయిన్ అనుష్క శర్మ ఏకంగా 400 కోట్ల డీల్ కుదుర్చుకుంది అంటూ ఒక టాక్ ప్రస్తుతం బాలీవుడ్ లో చెక్కర్లు కొడుతుంది. ఓటిటి ఫ్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ అనుష్కశర్మ కు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అనుష్కతో కొత్త సినిమాలు వెబ్ సిరీస్ లు డాక్యుమెంటరీలు తీసేందుకు గానూ 400 కోట్ల తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్. ఇప్పటికే పాతల్ లోక్, బబుల్ లాంటి వెబ్ సిరీస్ ల తో అనుష్క శర్మ మంచి విజయాన్ని సాధించింది. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ ఈ ముద్దుగుమ్మ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.