ఆనాటి చిత్రం : జయం మనదేరా!
ఈ నేపథ్యంలో ఈ తరుణంలో వెంకటేశ్, సౌందర్య జంటగా నటించిన జయం మనదేరా సినిమాకు సంబంధించి ఓ అరుదైన స్టిల్ ను రిలీజ్ చేశారు డైరెక్టర్ ఎన్.శంకర్. ఎన్ కౌంటర్ సినిమాతో ఎంతో పేరుతెచ్చుకున్న శంకర్ ఈ సినిమాతో కమర్షియల్ హిట్ కొట్టారు.ఇటలీలో షూటింగ్ సందర్భంగా తీసిన ఓ చిత్రం ఇప్పుడు నెట్టింట్లో ఉంచారు. సామాజికమాధ్యమాల ద్వారా ఆనాటి జ్ఞాపకాలను ఒక్క ఫొటోతో పంచుకున్నారు.ఈ సినిమా శంకర్ కెరియర్ ను మరో మలుపు తిప్పింది. పాటలన్నీ వందేమాతరం శ్రీనివాస్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా సామాజిక దృక్పథం, ప్రయోజనం అన్నవి ఈ సినిమాలో ఉంటాయి. పుష్కలంగా విలువలున్న సినిమా.వెంకటేశ్ ద్విపాత్రాభినయం చేశారు.
భాను ప్రియ ఓ ముఖ్యమైన పాత్రలో నటించారు.అతుల్ కులకర్ణి మరో ముఖ్యమైన పాత్రను పోషించారు. తరాల నుంచి వస్తున్న దుష్ట ఆచారాలను నిరసిస్తూ, దళిత జీవితాల్లో వెలుగు నింపే ఓ యోధుడి కథ ఇది.సినిమా పరంగా ఈ కథను ఎంతో కమర్షియలైజ్ చేశారు.అయినా కూడా ఎక్కడా అసభ్యతకు తావులేకుండా వినోద ప్రధానంగానే ఈ సినిమా మొదటి భాగాన్ని నడిపించారు.శంకర్ సినిమాల్లో అన్నింటిలో కూడా సామాజిక దృక్పథం, ప్రయోజనం అన్నవి ప్రధానాంశాలుగా ఉంటాయి.తరువాత కాలంలో కూడా ఆయన నుంచి మంచి సినిమాలే వచ్చాయి. కానీ అవి ఈ సినిమా అంత పేరు తెచ్చుకోలేకపోయాయి.
కమ్మనైన మనసులన్ని కల్సి ఆడెనే
ఊరూ వాడా కల్సి జాతరై వచ్చెనే
తోడూ నీడా కల్సి మహదేవుడాయెనే
ఆనందమో ఆకాశమో
సందడై సంద్రమై ఉప్పొంగెనే.....
అన్న పల్లవితో సాగే పాట ఇవాళ్టికీ వినపడుతుంది.