మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య, మెగా కోడలు అయిన ఉపాస గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రామ్ చరణ్ కి భార్యగా మరియు అపోలో అధినేత మనవరాలిగా కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పెంచుకుంది ఉపాసన. ముఖ్యంగా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫిట్నెస్ కి మరియు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా ప్రతి క్షణం సోషల్ మీడియాను మంచి పనుల కోసం మాత్రమే వాడే ఉపాసన తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.
దానికి కారణం తాజాగా ఆమె షేర్ చేసిన ఒక ఫోటోనే. నిన్న రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ గుడి గోపురం లోని ఫోటోని షేర్ చేసింది ఉపాసన. అందులో దేవుళ్ళ ఫోటోలు కొంత మంది ప్రజలు కూడా ఉన్నారు. అయితే అదే ఫోటోలో తనతో పాటు రామ్ చరణ్ కూడా ఉన్నారని ఎక్కడో కనిపెట్టండి అని సోషల్ మీడియా వేదికగా తన ఫాలోవర్స్ ని కోరడం జరిగింది. ఇక దీనిపై నెటిజెన్స్ ఇప్పుడు ఉపాసన పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎందుకంటే ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని..
ఇలాంటి పోస్టులు పెట్టి మీ పై ఉన్న గౌరవాన్ని తగ్గించుకోకండి అంటూ చాలా మంది నెటిజన్లు ఉపాసనకు ట్యాగ్ చేస్తూ కామెంట్ చేస్తున్నారు. అయితే గతంలో ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో ఉపాసన నెటిజన్ల ఆగ్రహానికి గురికాలేదు. ఎప్పుడూ సామాజిక కార్యక్రమాలతో ఉపాసన సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని తెచ్చుకునేది. కానీ మొదటిసారి ఉపాసన షేర్ చేసిన ఒక ఫోటో ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి దారి తీసింది. ఇక ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాలో ని తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అయితే అయితే దీనిపై ఇంకా ఉపాసన మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు...!!