నాగ చైతన్య సినిమా కోసం మైనస్ టెంపరేచర్ లో కష్టపడుతున్న రాశి ఖన్నా..!

Pulgam Srinivas
అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా ప్రస్తుతం మైనస్ టెంపరేచర్ వాతావరణం లో షూటింగ్ లో తెగ కష్టపడుతుంది, మరి ఇంత కష్టం ఏ సినిమా కోసమా అని అనుకుంటున్నారా... మరే సినిమా కోసమో కాదు నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమా షూటింగ్ కోసమే రాశి కన్నా మైనస్ డిగ్రీ టెంపరేచర్ లో కష్టపడుతుంది. ఈ సినిమాలో రాశి ఖన్నా తో పాటు అవికా గోర్‌, మాళ‌వికా నాయ‌ర్ హీరోయిన్ లుగా న‌టిస్తున్నారు,  ఈ మూవీ  రెండు వారాల చిత్రీక‌ర‌ణ మిగిలి ఉంది, ఈ సినిమా షూటింగ్ కోసం నాగ చైత‌న్య, రాశీ ఖ‌న్నా అండ్ టీమ్‌.. ర‌ష్యాలోని మాస్కోకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో టెంప‌రేచ‌ర్ -14 డిగ్రీలు ఉంద‌ట‌, ఇలా మైనస్ టెంపరేచర్ వాతావరణంలోనే ఈ చిత్రం షూటింగ్ జరుగుతుందట. ఈ సినిమా ఇంతకు ముందు షూటింగ్ షెడ్యూల్ ఇటలీలో జరిగింది, మైన‌స్ డిగ్రీల టెంప‌రేచ‌ర్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నామ‌ని రాశీ ఖ‌న్నా ఫొటోను షేర్ చేయ‌డం ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

 బీవీఎస్ ర‌వి అందించిన క‌థ‌తో విక్ర‌మ్ కుమార్ ఈ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు, దిల్ రాజు, శిరీష్ క‌లిసి శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ కి విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది,  అలాగే నాగ చైతన్య ఈ సినిమాలో మూడు వేరియేషన్స్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే రాశి ఖన్నా ఈ సినిమాతో పాటు గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది, అలాగే రాశి ఖన్నా పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లలో కూడా నటిస్తుంది.  నాగ చైతన్య కూడా ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న  లాల్ సింగ్ చద్ద సినిమాలో ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: