షాక్:తెలుగు హీరోలను మించి విజయ్ రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు అంటే..?
ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒక విషయం బాగా వైరల్ గా మారుతోంది. ఇక హీరో రెమ్యూనరేషన్, మూవీ శాటిలైట్ రైట్స్, విషయం పెద్ద హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.. తాజాగా కొద్దిరోజుల క్రితం దిల్ రాజు, ఈ సినిమా స్టోరీ పై, విడుదల తేదీ పై కొన్ని మాటలు మాట్లాడడంతో అవి వైరల్గా మారాయి. హీరో విజయ్ ఈ సినిమా కథ వినగానే.. తన 20 ఏళ్ల సినీ ఇండస్ట్రీ కెరియర్ లో ఇలాంటి స్టోరీ వినలేదని తెలియజేశాడట.
ఇక ఈ సినిమాని ఓకే చేయడంతో ఈ ఏడాది దీపావళికి విడుదల చేయాలని నిర్మాతగా భావిస్తున్నానని తెలియజేశాడు.. ఇక ఈ సినిమాకి విజయ్ 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం zee స్టూడియోస్ ఏకంగా 200 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. ఇక మన తెలుగు హీరోలు కేవలం 50 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక విజయ్ మాత్రం తెలుగులో మొదటి సినిమా అయినప్పటికీ 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకోవడం గమనార్హం. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.