బాబోయ్ : కీర్తి విషయంలో భయపడుతున్న మహేష్ ఫ్యాన్స్ ... మ్యాటర్ ఏంటంటే ... ??

GVK Writings
నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయిన కీర్తి సురేష్ ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకున్నారు. ఇక తన కెరీర్ లో 2019లో నాగ అశ్విన్ తీసిన ఒకప్పటి దిగ్గజ మహానటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి మూవీతో ఆమె పెద్ద సక్సెస్ అందుకున్నారు. అలానే ఆ సినిమాతో ఆమె జాతీయ ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకున్నారు.

ఆ తరువాత ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా కీర్తికి బాగా అవకాశాలు పెరిగాయి. ఇక ప్రస్తుతం ఆమె తెలుగులో సూపర్ స్టార్ మహేష్ తో సర్కారు వారి పాట అలానే మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలు చేస్తున్నారు. అయితే మహేష్ ఫ్యాన్స్ మాత్రం ఒక విషయంలో కీర్తి సురేష్ ని గురించి భయపడుతున్నారు. అయితే మ్యాటర్ ఏంటంటే ఇటీవల వరుసగా ఆమె నటిస్తున్న సినిమాలు అన్ని కూడా బాక్సాఫిస్ దగ్గర బోల్తా కొట్టడమే దానికి కారణం అని వారు అంటున్నారు. కొన్నాళ్ల క్రితం విశాల్ తో ఆమె చేసిన పందెం కోడి 2, అలానే లేడీ ఓరియెంటెడ్ మూవీ పెంగ్విన్, మిస్ ఇండియా, నితిన్ తో చేసిన రంగ్ దే, మోహన్ లాల్ తో చేసిన మరక్కార్, అలానే ఇటీవల రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన పెద్దన్న తో పాటు లేటెస్ట్ గా ఆమె నటించిన గుడ్ లక్ సఖి సినిమాలు అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సక్సెస్ కాలేదు.

దానితో తమ హీరోతో ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట కూడా అదే విధంగా ఫెయిల్ అవుతుందేమో అంటూ కొందరు మహేష్ ఫ్యాన్స్ అనుమానం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో జయాపజయాలు సహజం అని, సినిమా కథ, కథనాలు బాగుంటే ఎటువంటి నమ్మకాలు పని చేయవని, అందుతున్న ఇన్నర్ వర్గాల సమాచారం ప్రకారం మహేష్, కీర్తి ల సర్కారు వారి పాట ఎంతో అద్భుతంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోందని, అలానే తప్పకుండా ఈ సినిమా కీర్తి సురేష్ కి సూపర్ హిట్ అందించడం ఖాయంగా కనపడుతోందని అభిప్రాయపడుతున్నారు పలువురు సినీ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: