కీర్తి సురేష్ ''మహానటి'' గానే మిగిలిపోతుందా.. ?

VAMSI
నేను శైలజ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కీర్తి సురేష్. తెలుగులో మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు. ఆ తర్వాత సావిత్రి బయోపిక్ గా వచ్చిన 'మహానటి' చిత్రం అలా రిలీజ్ అవ్వడం లేటు కీర్తి పై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ ఒక్క సినిమాతో ఎనలేని క్రేజ్ ను తన ఖాతాలో వేసుకుంది ఈ మలయాళీ భామ. ఈ సినిమా తరవాత ఆమె తదుపరి ప్రాజెక్ట్ లపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.

ఆ తరవాత ఆమె చేసిన 'పెంగ్విన్' చిత్రంపై భారీ అంచనాలే ఏర్పడగా అది కాస్త తుస్సుమంది, చూసినంత సేపు ప్రేక్షకులు తలలు పట్టుకున్నారు. ఈ సినిమా తరవాత  'మిస్ ఇండియా' రాగా అది కూడా అలాగే నిరాశపరిచింది, ఇక అదే తూచ్ అనుకుంటే తాజాగా వచ్చిన 'గుడ్ లక్ సఖి' చిత్రం దీనికంటే ముందు వచ్చిన ఆ రెండు చిత్రాలే కాస్త బెటర్ అనిపించాయి. అంతలా నిరాశను మిగిల్చింది. ఇలా వరుసగా చిత్రాలు ఫ్లాప్ అవుతూ ఉండటంతో మహానటి సినిమాతో వచ్చిన మార్కెట్ మొత్తం కొట్టుకుపోతుందట. కీర్తితో సినిమాలు ఫిక్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఇపుడు ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

మహానటి వంటి అద్భుతమైన ఫేం అందుకున్న తరవాత కీర్తికి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు వరుసగా వెతుక్కుంటూ వచ్చాయి. అయితే కీర్తి కథలను ఎంపిక చేసుకునే విషయంలో కాస్త మెరుగ్గా ఆలోచించి ఉంటే బాగుండేది అని విమర్శలు వినపడుతున్నాయి. ప్రస్తుతం సర్కారు వారి పాట రిలీజ్ అయితే అప్పుడు తెలుస్తుంది, తనకు మహానటి తర్వాత అదృష్టం దక్కిందా లేదా దురదృష్టం వెంటాడుతూ ఉందా అని, మరి కీర్తికి మళ్ళీ లక్ ఇచ్చే సినిమా ఎపుడు వస్తుందో చూడాలి. ఇలా జరుగుతూ పోతే ఇక కీర్తి సురేష్ కి ఆఖరి హిట్ సినిమా మహానటి నే అని చెప్పుకోవాల్సి వస్తుంది. తన కెరీర్ మహానటితోనే ఆగిపోతుందా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: