ఈరోజుల్లో ఛాటింగ్ చేసినంత సులువుగా డేటింగ్ చేయడం అందరికి సరదా అయిపోయింది. ఇక హీరోయిన్లు అయితే చెప్పనక్కర్లెదు.. బట్టలు మార్చుకున్న అంత ఈజిగా బాయ్ ఫ్రెండ్ ను మార్చడం చేస్తున్నారు. ఆ జాబితా లోకి చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ వచ్చి చేరింది.. అందరి లాగా హీరోలతో లేదా బయట వ్యక్తులతో కాకుండా ఎకంగా బడా నిర్మాత కొడుకు తో డేటింగ్ లో వున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ ముద్దు గుమ్మ ఎవరో ఇప్పుడు వివరాల్లొకి వెళ్ళి తెలుసుకుందాం.. మహేశ్ మంజ్రేకర్ కూతురి గా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది సయిూ మంజ్రేకర్. తొలి సినిమాతోనే సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరో సరసన నటించె ఛాన్స్ కొట్టేసింది. దబంగ్-3' మూవీ లో బాలీవుడ్ కండల వీరుడి పక్కన నటించింది. ప్రస్తుతం టాలీవుడ్ కి కూడా పరిచయం కాబోతోంది. వరుణ్ తేజ్ సరసన 'గని' సినిమా లో నటిస్తోంది. సయిూ మంజ్రేకర్ కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ సాజిద్ నడియాడ్ వాలా కొడుకు సుభాన్ నడియాడ్ వాలాతో తిరుగుతూ కెమరాలకు చిక్కింది.
ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. దాంతో ఈ అమ్మడు డేటింగ్ లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి..తాజాగా ఈ విషయం పై అమ్మడు తాజాగా స్పందించింది. ఈ విషయం పై మీడియా తో మాట్లాడింది. నేను, సుభాన్ ఇద్దరం చిన్ననాటి నుంచి స్నేహితులం. ఒకరి గురించి మరొకరి కి బాగా తెలుసు. మేం డేటింగ్ చేస్తున్నట్టు వస్తోన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అటువంటి వార్తలను ప్రచారం చేయడం దారుణం.. దయచేసి ఇలాంటి వాటిని ప్రచారం చేయకండి.. అంటూ ఆమె విజ్ఞప్తి చేస్తున్నారు.. ఈ విషయం పై ఇంకా ఎన్ని చర్చలు జరుగుతాయో చూడాలి..