మాస్ డైరెక్టర్​ తో.. ఇస్మార్ట్ హీరో..అదిరిపోలే..

Satvika
తెలుగులో మాస్ డైరెక్టర్ అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శీను.. ఈయన ఎన్నో మాస్ సినిమాలను అందించారు.. ఎందరో హీరోలకు లైఫ్ ఇచ్చారని తెలుస్తుంది. అయితే బోయపాటి సినిమాలు అంటే ఒక మాస్ మసాలా అనే చెప్పాలి. అతని సినిమాలు అంతే విధంగా భారీ హిట్ ను అందుకుంటున్నాయి. అందుకే ఈ డైరెక్టర్ తో సినిమాలు అంటే హీరోలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు..అఖండ బ్లాక్ బస్టర్ సినిమాతో మరోసారి ఊరమస్ జాతర కొనసాగించాడు.

అంచనాలకి మించి అఖండని ప్యాక్ చేయడంలో వంద మార్కులు వేయించుకున్నాడు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ డైరెక్టర్ తర్వాత చిత్రం ఎవరితో చేస్తారు అంది ఆసక్తిగా మారింది. బోయపాటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో మరో సినిమా చేయాల్సి ఉంది. గతంలో సరైనోడు కాంబినేషన్ కావడంతో ఈ సినిమా పై ఫ్యాన్స్ కు భారీ అంచనాలే ఉన్నాయి. బన్నీ ఇటీవల నటించిన పుష్ప సినిమా భారీ హిట్ ను అందుకున్న అతను అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాను చేస్తున్నారు.

పుష్ప పార్ట్ 2 ను కూడా అదే జోష్ లో పూర్తీ చెయాలనె ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. మరో ఏడాది వరకు బోయపాటి ఇక్కడ స్కోప్ లేదు. అందుకే బోయపాటి ఇప్పుడు యంగ్ హీరో రామ్ పోతినేని తో మాస్ కథతో సినిమా చేసెందుకు బోయపాటి రెడీ అయినట్లు తెలుస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. రామ్ ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వం లో వారియర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాషల్లొ రానుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు రామ్ తో సినిమా చెస్తున్నారు.. మరి అది ఎలా వుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: