మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే, అందులో భాగంగా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమాకు దొంగాట ఫెమ్ వంశీకృష్ణ దర్శకత్వం వహించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది, 1970 లలో స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం రేణుదేశాయ్ ని సంప్రదిస్తున్నారని ఒక టాక్ నడుస్తుంది.
టైగర్ నాగేశ్వరరావు సినిమాలో రవితేజ సోదరి పాత్ర కోసం రేణు దేశాయ్ ని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట, ఇప్పటికే ఈ విషయమై రేణుదేశాయ్ ని దర్శక, నిర్మాతలు సంప్రదించగా ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే రవితేజ ఈ సినిమాతో పాటు రామారావు ఆన్ డ్యూటీ సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు, ఈ సినిమాలో రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది, ఈ సినిమాలతో పాటు సుదీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాలో కూడా మాస్ మహారాజా రవితేజ నటించబోతున్నాడు, అలాగే త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా సినిమాలో నటించడానికి రెడీ గా ఉన్నాడు.