ప్రభాస్ లైనప్ మారుతుందా!!
గత మూడు సంవత్సరాలుగా ప్రభాస్ నటించిన సినిమాలేవీ కూడా వెండితెరపై చూడలేని కారణంగా ఆయన అభిమానులు ఎంతగా నో నిరాశపడ్డారు. వారి ఆకలి తీరుస్తూ ఇప్పుడు ఇంత తక్కువ వ్యవధిలోనే ఈ రెండు సినిమాలను విడుదల చేస్తుండటం విశేషం. ఇక ఆయన బాలీవుడ్ లో చేస్తున్న ఆది పురు ష్ చిత్రం దాదాపుగా పూర్తయ్యే స్థితికి వచ్చిందని తెలుస్తుంది. తొందర్లోనే ఈ చిత్రానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకుని ఆగస్టులో విడుదల చేయాలి అన్నది ఈ చిత్ర బృందం యొక్క ఆలోచన.
అలా ఈ మూడు సినిమాలను విడుదల చేసిన తర్వాత ఆయన చేయబోతున్న నాగ అశ్విన్ సినిమా మరియు స్పిరిట్ సినిమాలు తేదీ ప్రకారం కాకుండా కొంత ఆలస్యంగా షూటింగ్ కు వెల్లే విధంగా పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలుస్తుంది. ఓ బాలీవుడ్ దర్శకుడితో పాటు మారుతి చెప్పిన కథ కూడా బాగా ఉండడం తో ఈ రెండు సినిమాల కంటే ముందే మారుతి సినిమా చేయాలని ప్రభాస్ నిర్ణయించుకోగా ఇప్పుడు ఆయన ఏర్పాటు చేసుకున్న సినిమా ల లైనప్ లో మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకుపోతూ ఆయన అభిమానులను భారీ స్థాయిలో అలరిస్తున్నారు అని చెప్పవచ్చు.