ఆ విషయంలో తగ్గేదే లే అంటున్న వినాయక్...!

murali krishna
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో వినాయక్ ఒకరని అందరికి తెలుసు.యాక్షన్ .. ఎమోషన్ మరియు కామెడీపై వినాయక్ కి ఎంతో పట్టుంది. మాస్ పల్స్ తెలిసిన దర్శకుడిగా ఆయనకి మంచి క్రేజ్ kuda ఉంది.

ఆది .. ఠాగూర్ .. కృష్ణ అలాగే అదుర్స్ .. వంటి సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. చిరంజీవి రీ ఎంట్రీ తమ సినిమా ద్వారా జరగాలని చాలామంది సీనియర్ డైరెక్టర్లు గట్టి ప్రయత్నమే చేశారట కానీ 'ఖైదీ నెంబర్ 150' సినిమాను వినాయక్ మాత్రమే చేయాలని చెప్పి చిరంజీవి ఆయనను రంగంలోకి దింపారట.దీనిని బట్టి ఒక దర్శకుడిగా ఆయనపై చిరంజీవికిగల నమ్మకం ఏ స్థాయిలో ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక దర్శకుడిగా అంతటి పేరు తెచ్చుకున్న వినాయక్ తన సినిమాల్లో ఒకటి రెండు సార్లు తెరపై మెరిశారట.. వినాయక్ కాస్త రంగు తక్కువైనా కనుముక్కుతీరు బాగుంటుందని అందువలన ఆయనకి కూడా నటనపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఏజ్ కి తగిన ప్రధానమైన పాత్రతో 'శీనయ్య' సినిమా రూపొందనున్నట్టు ఆ మధ్య వారు ప్రకటించారు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు రంగంలోకి దిగాడట.. కొంత షూటింగు కూడా నడిచిందని టాక్.. ఈ సినిమాకి సంబంధించి వినాయక్ లుక్ కూడా ఒకటి బయటికి వచ్చింది. అయితే ఆ తరువాత ఈ సినిమా షూటింగు ఆగిపోయిందట.

తాజాగా వినాయక్ ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ .. "శీనయ్య కథను పావుగంటలో విన్నప్పుడు చాలా బాగా అనిపించిందని కానీ ఒక సినిమాకి అవసరమైన కథగా రెండున్నర గంటలకి తగినట్టుగా రెడీ చేసిన తరువాత ఆశించిన స్థాయిలో రావడం లేదనే విషయం నాకు అర్థమైంది. అప్పుడే ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేయడం జరిగింది. భవిష్యత్తులో ఇక 'శీనయ్య' వచ్చే అవకాశం లేదుగానీ మరో రూపంలో మీ ముందుకు వస్తానని ఆయన చెప్పారు.. మంచి ప్రాజెక్టుతో మిమ్మల్ని తప్పకుండా పలకరిస్తాను" అంటూ నటుడిగా తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉంటాననే విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు.

ఇక తన దర్శకత్వంలోని సినిమాను గురించి ప్రస్తావిస్తూ .. "దర్శకుడిగా నా ప్రయాణం అస్సలు ఆగదు .. అందుకు సంబంధించిన పనులు ఎప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఒక మంచి కథను సెట్ చేస్తున్నాను. అయితే ఆ కథకు పూర్తి రూపం రావలిసి ఉందని కథ పూర్తయిన తరువాత అది ఎవరితో చేస్తే బాగుంటుందా అనేది చూస్తాను. స్టార్ హీరోలందరికీ కూడా నేనేంటే ఇష్టమే. అయితే కథ ఎవరికైతే సరిపోతుందో వాళ్లతో చేయడానికి మాత్రమే నేను ఇష్టపడతాను" అని చెప్పాడు. మరి వినాయక్ తయారుచేసే ఆ కథ ఏ జోనర్లో ఉంటుందో అస్సలు ఏ హీరో దగ్గరికి వెళుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: