యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ తెరపై కనిపించే ఇప్పటికి మూడు సంవత్సరాలు దాటి పోతుంది, ఆఖరుగా
జూనియర్ ఎన్టీఆర్,
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన
అరవింద సమేత సినిమాతో ప్రేక్షకులను అలరించాడు, ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ
సినిమా తర్వాత
జూనియర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన
ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించాడు, ఈ
సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది, కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను
జనవరి 7 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఆ తర్వాత దేశంలో
కరోనా విజృంభించడంతో ఈ
సినిమా విడుదలను చిత్ర బృందం వాయిదా వేసింది, అయితే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాను
మార్చి 18 వ తేదీన లేదా ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.