భామ కలాపం: చీఫ్ గెస్ట్గా రౌడీ హీరో..!!

Divya
ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాలకు ప్రమోట్ చేసుకోవాలి అంటే పెద్ద పెద్ద స్టార్ హీరోలు , హీరోయిన్లు, డైరెక్టర్లు ఈ చిన్న సినిమాలను ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇక ఇప్పటికి ఎంతో మంది నిర్మాతలు, వారసులు, దర్శకుల వారసులు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు కూడా మన స్టార్ హీరోలు వారికి సినిమా ప్రమోషన్ విషయంలో సహాయం చేసి వారి సినిమాలు హిట్ అయ్యేలాగా చేశారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో ఆహా లో ప్రసారం కాబోతున్న భామ కలాపం సీరీస్ కు సంబంధించి ఈ రోజు గ్రాండ్ గా ట్రైలర్ ను లాంచ్ చేయబోతున్నారు..
ఈ ట్రైలర్ ను లాంఛ్  చేయడానికి రౌడీ హీరో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సీరీస్  నుంచి టీజర్ విడుదలవగా ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది.. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ సినిమాను నేరుగా ఓటీటీ సంస్థ ఆహా లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది చిత్రం యూనిట్. నిజానికి ఈ ప్రముఖ  ఓటీటీ సంస్థ అయినటువంటి ఆహా తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని పంచుతూ సూపర్ హిట్ చిత్రాలతో పాటు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను అందిస్తూ  ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతోంది..
ఇతర భాషల్లో సినిమాలను సైతం తెలుగులోకి డబ్ చేసి విడుదల చేస్తూ డిజిటల్ ప్లాట్ ఫారంలో నెంబర్ వన్ దిశగా దూసుకుపోతోంది ఈ సంస్థ. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రియమణితో మరో విభిన్న ప్రయత్నం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. సస్పెన్స్ నేపథ్యంలో సాగే ఈ సిరీస్ ఆహా లో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ప్రసారం కానుంది. హైదరాబాదులో ట్రైలర్ లాంచ్ కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతుంది. అభిమన్యు తాడిమేటి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నారు. టీజర్ లో కొత్త వంట చేయబోతున్నట్టు గా కనిపించిన ప్రియమణి.. ఈసారి ట్రైలర్ లో ఏం చేయబోతోందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: