అప్పట్లో చాలామంది స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన తర్వాత సినీ ఇండస్ట్రీకి దూరం అవుతున్న విషయం తెలిసిందే. కానీ తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా తిరిగి మళ్ళీ తన సినీ కెరీర్ ను మొదలు పెడుతున్నారు. అలాంటివారిలో మీనా, రమ్యకృష్ణ, ఆమని లాంటి వారితో పాటు మరింతో మంది సీనియర్ హీరోయిన్లు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా పవన్ రెండవ భార్య ప్రముఖ హీరోయిన్ రేణు దేశాయ్ కూడా తాజాగా సినీ ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి..
ఇక అదేదో కాదు టైగర్ నాగేశ్వరరావు.. అయితే ఈ సినిమాకి ముందు స్టువర్ట్ పురం దొంగ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ ..అక్క పాత్ర కోసం రేణు దేశాయ్ ను సంప్రదించారట ..కథాబలం ఉండడంతో ఆమె కూడా ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కానీ మరోవైపు రవితేజ కూడా టైగర్ నాగేశ్వరరావు సినిమాను రూపొందించబోతుండడంతో ఈ 2 సినిమా కథలు ఒకే కథ ఉన్న నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
ఇక అక్కడితో రేణుదేశాయ్ పాత్ర కూడా ముగిసిపోయింది.. కానీ రవితేజ నటించబోతున్న టైగర్ నాగేశ్వరరావు సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో రేణుదేశాయ్ కి మళ్లీ అక్క పాత్ర లభించడం గమనార్హం. ఎట్టకేలకు టైగర్ నాగేశ్వరరావు సినిమాలో అక్క పాత్ర ద్వారా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది ఈ ముద్దు గుమ్మ . అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ క్లాప్ కూడా రేణూ దేశాయ్ కొట్టినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు, ఇటు రేణూ దేశాయ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే తమ అభిమాన నటి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అని అనడంతో ఆమె పై ఆశలు పెంచుకోవడం గమనార్హం.