ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ నిర్మాణ సారథ్యంలో అజిత్ హీరోగా హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తూ తెరకెక్కుతోన్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ వాలిమై.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు గత రెండు , మూడు సంవత్సరాల నుంచి ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ఇకపోతే ఈ సినిమాను బోనీకపూర్ తో పాటు జీ సినిమా స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి చెన్నై, హైదరాబాద్ తో పాటు రష్యాలో కూడా కొన్ని సన్నివేశాల షూటింగ్ చేయబడ్డాయి. సుమారుగా 150 కోట్ల రూపాయలతో తెరకెక్కబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూడటమే కాకుండా ఈ సినిమాకు సంబంధించి టీజర్ , ట్రైలర్ ల విషయంలో బి ఎం ఎస్ యాప్ లో ఎక్కువగా వీక్షించిన మూవీ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఈ సినిమా తర్వాత ఆ స్థానాన్ని మహేష్ బాబు నటించబోతున్న సర్కారు వారి పాట సినిమా నమోదు చేసుకోవడం గమనార్హం. ప్రముఖ దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా సర్కార్ వారి పాట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుని మిగిలిన 40 శాతం షూటింగ్ కూడా త్వరలోనే పూర్తి చేయబోతున్నట్లు మహేష్ బాబు కూడా అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇకపోతే ఈ సినిమా ఒక రికార్డు సృష్టించింది అని చెప్పవచ్చు.. అదేమిటంటే.. BMS యాప్ లో 90 వేల మంది ఈ సినిమా చూడటానికి ఆసక్తి చూపుతున్నట్లు గా వెల్లడైంది..
ఇక వాలిమై సినిమా తర్వాత అంతటి రికార్డును సర్కారు వారి పాట సినిమా సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ సినిమా విడుదల అయితే మరెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని అభిమానులు సైతం ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది.