టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య ఇప్పటికే పోయిన సంవత్సరం విడుదలైన లవ్ స్టోరీ సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాడు, ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించింది. ఇలా లవ్ స్టోరీ సినిమా తో పోయిన సంవత్సరం మంచి విజయాన్ని అందుకున్న నాగ చైతన్య ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ న విడుదలైన బంగార్రాజు సినిమాతో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు, ఇలా ఇప్పటికే వరుసగా రెండు విషయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న నాగ చైతన్య ప్రస్తుతం కూడా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమా లో హీరో గా నటిస్తున్నాడు, ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటిస్తోంది.
నాగ చైతన్య ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్ద సినిమాలో కూడా ఒక ప్రముఖ పాత్రలో నటిస్తున్నాడు, ఈ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇలా సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న నాగ చైతన్య ఒక వెబ్ సిరీస్ లో కూడా నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే, ఈ వెబ్ సిరీస్ కు విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించబోతున్నారు. వీటితో పాటు ఇటీవలే తమిళ్ లో మనాడు సినిమా తో మంచి విజయం అందుకున్న వెంకట్ ప్రభు తో కూడా నాగ చైతన్య సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి, ఇలా నాగ చైతన్య ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్నాడు.