బాలీవుడ్ ని ఏలుతున్న సౌత్ సినిమాలు..
ఇక తమిళంలో నుంచి ఖైదీ,అన్నియన్, జిగర్తాండ,విక్రమ్ వేద దృవాంగల్,పత్తినారు,రాట్ససన్,తడమ్,కోమలి,మా నగరం,అరివు,మానాడు, సూరరాయిపోట్రు ఇంకా మాస్టర్ సినిమాలు రీమేక్ అవుతున్నాయి. ఇక మలయాళం నుంచి కూడా ఈ లిస్ట్ అనేది పెద్దగానే వుంది.ఇక పృథ్విరాజ్ సుకుమారన్ `డ్రైవింగ్ లైసెన్స్` మోహన్ లాల్ `దృశ్యం 2` అన్నాబెన్ `హెలెన్ అయ్యప్పనుమ్ కోషియుమ్` నాయట్టు.. ఈ సినిమాలన్ని కూడా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి.అయితే కన్నడ నుంచి మాత్రం ఒకే ఒక్క `యు టర్న్` సినిమా మాత్రం రీమేక్ అవుతోంది. మరి కొన్ని తెలుగు తమిళ కన్నడ సినిమాలు చర్చల దశలో వున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో సౌత్ నుంచి బాలీవుడ్ లో ఇన్ని సినిమాలు రీమేక్ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక రిజినల్ సినిమా జాతీయ స్థాయిలో ఇండియన్ సినిమాని రూల్ చేస్తున్న తీరుని చూస్తున్న వారంతా ఇదొక శుభ పరిణామమని ఇప్పడే సినిమాకు మంచి రోజులొచ్చాయని తెగ ఆనంద పడుతున్నారు.