విజయ్ దేవరకొండ ట్విట్టర్ పేరు మార్చడం వెనుకున్న సీక్రెట్ ఇదే?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోలు అందరిలో టాప్ లెవెల్ లో దూసుకుపోతున్న ఒకే ఒక్కడు మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ అని టక్కున చెప్పేస్తారు. ఎందుకంటే యూత్ లో విజయ్ కి ఉన్న క్రేజ్ మామూలుగా లేదంటే నమ్మండి. కెరీర్ మొత్తంలో రెండు సినిమాలతోనే రేంజ్ మారిపోయింది. అర్జున్ రెడ్డి సినిమా వచ్చాక యూత్ కు ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయాడు. ఇక ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో అటు అమ్మాయిలకు మరియు కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాడు. అలా టాలీవుడ్ లో తనకంటూ ఒక బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. తాన్ స్టైల్ చూసి ఫాలో అయ్యేవారు లక్షల్లో ఉన్నారు అంటే నమ్మలేము.
నిరంతరం ఫ్యాన్స్ కు సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటూ ఉంటారు. ఇదిలా ఉండగా సడెన్ గా విజయ్ దేవరకొండ తన ఫ్యాన్స్ కు ఒక భారీ షాక్ ఇచ్చాడు. తాజాగా విజయ్ దేవరకొండ కు థమ్స్ అప్ కూల్ డ్రింక్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకుంది. ఇంతకు ముందు వరకు టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు అంబాసిడర్ గా ఉండగా ఇప్పుడు ఆ స్థానంలో థమ్స్ అప్ యాజమాన్యం మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ నియమించింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్ కు అంతలోనే షాక్ తగిలింది. విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ పేరును మార్చుకున్నాడు.
దీనికి సంబంధించిన యాడ్ లో ' థమ్స్ అప్ అనేది సాఫ్ట్ డ్రింక్ కాదు... ఇది ఒక తూఫాన్' అనే డైలాగ్ ఉంది. అందుకే తన ట్విట్టర్ అకౌంట్ లో 'విజయ్ దేవరకొండ' పక్కన తూఫాన్ అని తగిలించాడు. ఇది నిజంగా ఒక షాక్ అనే చెప్పాలి. మరి విజయ్ దేవరకొండ థమ్స్ అప్ యాడ్ ద్వారా యాజమాన్యానికి మరింత సేల్స్ జరగాలని ఆశిద్దాం...