మాస్ మహారాజా
రవితేజ పోయిన సంవత్సరం విడుదలైన
క్రాక్ సినిమాతో ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు, ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు కలెక్షన్ ల వర్షం కురిపించడంతో
రవితేజ ఫుల్
జోష్ లోకి వచ్చాడు. అయితే
క్రాక్ సినిమాతో వచ్చిన ఫామ్ ను అదే రేంజ్ లో కంటిన్యూ చెయ్యాలనే ఉద్దేశంతో
రవితేజ వరుస క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు, అందులో భాగంగా ప్రస్తుతం
రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమాకు
శరత్ మండువ దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈ సినిమాలో దివ్యాన్ష
కౌశిక్ .. రజీషా విజయన్
హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఈ సినిమాలో
రవితేజ పవర్ ఫుల్ ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ
సినిమా నుండి ఇప్పటికే కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను పెంచాయి, ఇలా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో
గోవా బ్యూటీ
ఇలియానా ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి, మరి ఇప్పటి వరకు ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే
రవితేజ ఈ సినిమాతో పాటు
రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు, ఈ సినిమాలో డింపుల్ హయాతి, మీనాక్షి
చౌదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఈ సినిమాను ఏప్రిల్ 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది. అలాగే ఈ సినిమాలతో పాటు
రవితేజ సుధీర్
వర్మ దర్శకత్వంలో రావణాసుర, త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, టైగర్ నాగేశ్వర్ రావు సినిమాల్లో కూడా నటించబోతున్నాడు.