రంగు తక్కువ అని ఎన్నో సార్లు రిజెక్ట్ చేశారు... డింపుల్ హయాతి..!

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది  మొదటి అవకాశం కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు, అలా ఎదురు చూసే క్రమంలో వారు అనేక అవమానాలను, కష్టనష్టాలను ఎదుర్కోవాల్సి కూడా వస్తుంది. అయితే అలా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎదుర్కొన్న కష్టాలను, అవమానాలను అప్పుడప్పుడు నటి నటులు బయటికి చెబుతూ ఉంటారు, అయితే తాజాగా డింపుల్ హయాతి కూడా సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాలను తాజాగా బయట పెట్టింది. డింపుల్ హయాతి, వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దల కొండ గణేష్ సినిమాలో జర్రా జర్రా అనే స్పెషల్ సాంగ్ లో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. 

 ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది, ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను చిత్ర బృందం విడుదల చేయగా వీటికి జనాల నుండి మంచి రెస్పాన్స్ రావడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై మంచి అంచనాలు కలగజేశాయి, ఈ సినిమాను ఫిబ్రవరి 11 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే ప్రకటించింది,  ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డింపుల్ హయాతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. గద్దలకొడ గణేష్‌ సినిమా కంటే ముందు చాలా ఆఫీసుల చుట్టూ తిరిగానని తెలిపిన డింపుల్ హయాతి నల్లగా, రంగు తక్కువ ఉన్నానని చెబుతూ తిరస్కరించారని, అలా ఎన్నిసార్లు రిజక్ట్‌ అయ్యానో లెక్కేలేదని చెప్పుకొచ్చింది, ఇంకా ఆ విషయమై మాట్లాడుతూ... ఫెయిర్ స్కిన్ ఉన్న అమ్మాయి కావాలి అని అంటుండేవారు, ఆ సమయంలో కొంచెం బాధగా అనిపించేది అని డింపుల్ హయాతి తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: