సరికొత్త మూవీకి శ్రీకారం చుట్టనున్న అల్లరి నరేష్..!!
దాదాపు 8 సంవత్సరాల పాటు వరుస ఫ్లాపులతో ఇండస్ట్రీకి దూరమైన అల్లరినరేష్ 2021 సంవత్సరపు తొలినాళ్ళలో నాంది సినిమా ద్వారా ప్రేక్షకులకు తనలో ఉన్న కామెడీ ని పక్కనపెట్టి సీరియస్ నటనతో అల్లరినరేష్ లో ఈ కోణం కూడా ఉందని అందరూ ఆశ్చర్యపోయేలా తన నటనతో అందరిని మెస్మరైజ్ చేశాడు. ఈ సినిమాతో పూర్తిస్థాయిలో విజయాన్ని అందుకొని మళ్లీ ఇప్పటికీ ఒక సినిమా కథను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తన కొత్త సినిమా అంటే అల్లరి నరేష్ తన 59వ సినిమాను ఏ ఆర్ మోహన్ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు.
అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను కూడా ఈ రోజు పూర్తి చేయనున్నట్లు సమాచారం. నాంది సినిమా తర్వాత ఏకంగా సంవత్సర కాలం గ్యాప్ తీసుకున్న అల్లరి నరేష్ ఇప్పుడు ఈ కొత్త సినిమాతో మరింత సక్సెస్ ను అందుకుంటాడు అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక పోతే వీరి తండ్రి ఈ వి వి సత్యనారాయణ ఎంతోమంది హీరోలకు మంచి సక్సెస్ అందించిన విషయం అందరికీ తెలిసిందే . రాజేంద్ర ప్రసాద్ ని మొదులుకొని చిరంజీవి వరకు ఇలా చాలా మంది స్టార్ హీరోలుగా సక్సెస్ అయ్యారు అంటే ఈయన డైరెక్షన్లోనే వారంతా సక్సెస్ సాధించగలిగారు అని చెప్పవచ్చు.